మన తెలుగు-మన వెలుగు:- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
తేనెలూరు భాష మన తెలుగు భాష 
అమ్మ చనుబాలతోడ 
అలవడే భాష 
అమృతమయమైన భాష 

పద్యమైన గద్యమైన
గేయమైన కైతనైన
ఒదిగిపోవుభాష
మరుగుపరచకుభాష
మన భవితే ఈ భాష

కవిత్రయానికి ఆధార మీభాష
ఆంధ్ర మహాభారతమ్మున శోభిల్లెనీభాష
భువనవిజయమ్మున భవ్యమైనదీభాష
అష్టదిగ్గజాల ప్రబంధమై రాణించె నీభాష
శివకవుల కవనాన భక్తితత్త్వమైనదీభాష
రామదాసు అన్నమయ్యలవాగ్గేయమీభాష
వేంగమాంబ వేంకటేశ్వర మహత్మ్యమైనదీభాష
మొల్లమాంబతేటతెలుగు
రామాయణమీభాష
కృష్ణతత్వమును పాడిన భక్తమీరాబాయిదీభాష

దేవులపల్లి భావకైతకు మూలమైనదీభాష
విశ్వనాథుని కిన్నెరసాని పాటైనదీభాష
దాశరథి తిమిరముతో సమరమునడిపెనీభాష
సినారె విశ్వంభర కావ్యమైనదీభాష

వచనకైత కుందుర్తి వచనకవిత్వమీభాష
శ్రీ శ్రీ అభ్యుదయానికి ఆయుధమైనదీభాష
దిగంబర పైగంబరులకు ప్రాణమైనదీభాష
దళిత స్త్రీవాద మైనారిటీవాదాలను అలుముకున్నదీభాష


నా గొడవ కవి కాళోజీ యాసబాసకు మూలమైనదీభాష
శ్రీనాథ కవిసార్వభౌముని సీసపద్యమీభాష
కృష్ణదేవరాయలనోటదేశభాషలందు తెలుగు లెస్స ఈ భాష
జాషువా కవితాఖడ్గమీభాష
సంభాషిస్తే నీ భాష బ్రతుకుతుందిరా
భాషించకున్న నీ భాష కనుమరుగౌనురా

అవసరానికి అన్యభాషలు తప్పనను 
అన్నింటా ఆంధ్రమ్ము ఎంతో ఒప్పంట
మన భాషను బ్రతికిద్దాం
మన యాసను బ్రతికిద్దాం
మన కట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుందాం


కామెంట్‌లు