గతం:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
గతాన్ని మళ్ళీ మళ్ళీ
తొవ్విపోయకు
అది కష్టనష్టాల సమాహారం

తీస్తే సినిమా అవుతుంది
రాస్తేనవల అవుతుంది
గ్రంథస్థం చేస్తే
సమగ్ర మానవవ్యక్తిత్వవికాసమవుతుంది

గతాన్ని జీర్ణించుకోలేని
చరిత్ర హీనులు
గతన్నెప్పుడు
తలుచుకోవొద్దు
బోగీ మంటల్లో దగ్దం చేయమంటారు
 విచక్షణ లేని వారు
అనారోగ్యాన్ని సహితం చేదు మాత్రతోనే 

నయమవుతుందన్న ఇంగితం కూడా లేని
సోకాల్డ్ మేధావులు

గతమంటే అది వ్యక్తిత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించే
ప్రగతిశీలవాదం


కామెంట్‌లు