ఇలా చేస్తే చాలు:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
ఆత్మీయత పంచితే
ఆదర్శం చూపితే
అవనిలోన అదృష్టం
ఆనందం పొందితే

సంస్కారం చాటితే
సమ న్యాయం కోరితే
ఎంతైనా మేలు మేలు
ధరణిలోన చాలు చాలు

కలహాలే వీడితే
కలవరమే మానితే
భూలోక స్వర్గమేను
కలసిమెలసి బ్రతికితే

చేయి చేయి కల్పితే
మనసు మనసు కలిస్తే
ఏదైనా సాధ్యమే
జీవితాన విజయమే


కామెంట్‌లు