ఉండాలోయ్!జగతిలో:- --గద్వాల సోమన్న,సెల్:9866414580
ఫలాలిచ్చు తరువులా
జలాలిచ్చు చెరువులా
ఉండాలోయ్!జగతిలో
విద్య నేర్పు గురువులా

ప్రవహించే యేరులా
వికసించే పూవులా
ఉండాలోయ్!జగతిలో
విహరించే ఖగంలా

రవళించే మువ్వలా
ముద్దులొలుకు గువ్వలా
ఉండాలోయ్!జగతిలో
వెలుగులీను దివ్వెలా

కడుపు నింపు పొలంలా
చెట్టు మీద ఫలంలా
ఉండాలోయ్!జగతిలో
కదిలించే కలంలా

సాగు చేయు హలంలా
సాహసించే బలంలా
ఉండాలోయ్!జగతిలో
పదిమందికి గళంలా


కామెంట్‌లు