గురువు గారి మాటలు:- --గద్వాల సోమన్న,:9866414580
]పలకరించు ప్రేమగా
బలపడును బంధాలు
యోచించు గొప్పగా
వృద్ధినొందు జీవితాలు

ప్రశ్నించు సూటిగా
పుట్టును ప్రకంపనలు
నిలబడుము గట్టిగా
తెలియును బలాబలాలు

జీవించు హాయిగా
స్వర్గమే నీదగును
కష్టపడు పూర్తిగా
ఫలితాలు సొంతమగును

భాషించు మృదువుగా
హత్తుకొనును మనసులు
బోధించు గురువుగా
మార్పునొందు మనుషులు


కామెంట్‌లు