మౌన ప్రేమను పండించిన చెలి: - విత్తనాల విజయకుమార్, హైదరాబాద్-9985117789
సాహితీకవికళా పీఠం
సాహితీ కెరటాలు
==============
మౌన ప్రేమను పండించిన చెలి

ప్రేమ — ఒక ఆకర్షణ,
వయసు తెచ్చే చేష్ట —
మనసులో రేగే అలజడి,
మధురమైన భావనలు పుట్టి,
ఎదలోన జాగృతమైన మమత...

తెలపవలెనను కోరిక, తెలుపలేక,
భాష లేని మౌనమే — మధురమైన అనుభూతి.

మలిన మెరుగని మనసున, మనవి చేసి —
సొంతమనుకొను మనసుకు ఒసగకుండా,
ఎదురు చూపులు, రూపులు ఎదను తాక,
పరవశించిన పడతికి — మౌన ప్రేమ!

ఈమె వలచిన ప్రియుడు ఇదే విధముగ,
ఈమెపై ప్రేమను తెలుపని — మౌని!

మౌన ప్రేమలు అంతరంగమున సమాధి కాకుండా,
వెల్లడించని అభిమతి — వెలుగు చూడ...

పడతి కదలిక గమనించిన ఒక చెలియ వలన —
తెలిసి, పురుషుడు స్పందించి తెగువ చూపె —
వలచిన మగువకు తన వలపు తెలిపె —
పెద్దలకు తెలుపగ, పెద్ద మనసు చూపె.

ప్రేమికులు మనవుతో ఒక్కటయ్యి —
అనురాగపు స్వరాలతో,
హృదయవీణలు మీటగా —
ఎదను దాచిన వలపులు
పొంగి, పొరలె...

•••••••••••••••


కామెంట్‌లు