ప్రేమ మైకం :-కాకర్ల రమణయ్య-గుడిపాటిపల్లి- 9989134834
సాహితీ కవికళా పీఠం 
సాహితీ కెరటాలు 
=============
అరవిరిసిన గులాబీతో,
తొలిప్రేమ మధురిమలు...!

చిన్న చిన్న రెక్కలతో,
అందమైన రంగులతో
నా మనసును దోచింది...!

శుభోదయంతో స్వాగతం చెప్పి,
ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది.!

తన సాంగత్యంలో రోజులు
క్షణాలుగా కాలగర్భంలో
కలిసి పోయాయి...!

ఎన్నెన్ని ఊసులు చెప్పేదని —
భూమి గర్భాన్ని చీల్చుకొని
మొలకై పుట్టిన కష్టాన్ని...,

కుండపోతల వర్షాల నుంచి,
ప్రకృతి విపత్కారాల నుంచి
తనను తాను రక్షించుకున్న 
తీరును...!

కళ్లింతలు చేసుకుని చెప్తుంటే,
మనసు అప్పగించి వింటున్నా...!

యవ్వన పరుగులలో
మొగ్గై పొటమరించి,
పువ్వై వికసించిన తీరు తెన్నులు
సిగ్గుల మొగ్గై చెప్తుంటే...,

ప్రియురాలి సిగ్గుల తెరలో
దోబూచులాడుతూ,
తన్మయత్వంతో చెవులు 
రిక్కించి తనువును
అప్పగించా...!

"సౌందర్యమంతా నీ స్వంతం" అంటే,
తమకంతో హక్కున
చేర్చుకొని ఆలింగనం చేసుకున్నా...!

ధారలై కారుతున్న
రక్తపు చీలును చూసి గుర్తుకు వచ్చింది —
అందమైన ప్రియురాలు గుండెల్లో
పదునైన ముళ్ళు ఉందని...!


కామెంట్‌లు