సుప్రభాత కవిత : - బృంద
రాబోయే రేపటి వెలుగును
స్వాగతిస్తూ దారి మొత్తం
పచ్చని పచ్చిక తివాచీ పరచి 
వెచ్చగ తాకే కిరాణాలను 
హత్తుకుని పరవశిస్తూ....

అడుగులకు మడుగులోత్తి
పలకరించి పులకరించు
పుడమి పైని ప్రేమనంతా
చిలకరించి మెరుపులద్ది
మురిసిపోయే పసిడి కాంతి..

నీడలో తాకలేని తావులన్నీ 
తమ వంతెపుడా అని తలచి
దరికి చేరు సమయం కోసం 
ఎదురుచూసి వేచివున్న తీరు
వెలుగు నీడలు దోబూచలు...

పగలు వెంట రేయిలా
వెలుగు వెంట నీడలా
అడుగు వెంట అడుగులా
వచ్చే కష్ట నష్టాలను
సమంగా తీసుకోవాలని చెబుతూ.

అనుభవాలే  అధ్యాయాలుగా 
అడుగడుగునా  గుర్తుంచుకునే
పాఠాలెన్నో నేర్పుతూ...
చేసిన తప్పులకు శిక్షలుగా
గుణపాఠాలు  నేర్పేదే జీవితం

చదవని మరో  జీవిత పుటను 
తెరచి మనతో చదివించాలని
ముంగిట నిలిచిన మరో రోజును
హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తూ
అంతా మన మంచికే అనుకుంటూ

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు