న్యాయాలు -896
న ధర్మ వృద్ధేషు వయః సమీక్ష్యతే న్యాయము
***
న అనగా లేదు.ధర్మ అనగా కర్తవ్యము,పుణ్యము, సంప్రదాయము, న్యాయము, స్వభావము, వేదోక్త నిధి, యజ్ఞము,సత్కార్యము,మూల గుణము, భక్తి, ఉపనిషత్తు, ధర్మరాజు, యముడు.వృద్ధ అనగా ముదుసలి. వృద్ధేషు అనగా వృద్ధులలో ,ముసలివారిలో . సమీక్ష్యతే అనగా పరిశీలించబడుతుంది,విమర్శించబడుతుంది అనే అర్థాలు ఉన్నాయి.
ధర్మము తెలుసుకొని ఉండడానికి వయస్సుతో నిమిత్తం లేదు అనగా ధర్మజ్ఞానం ఉన్న వాళ్ళ విషయంలో వయసు పరిగణించరు అని అర్థము.
ఎందరో వృద్ధులైన తపోధనులు పార్వతీ దేవి తపస్సు చేస్తున్న సమయంలో ఎంతో దూరం నుంచి ఆమెను చూడటానికి వచ్చారు. ఆ సందర్భాన్ని ఉద్దేశించి మహాకవి కాళిదాసు తాను రాసిన "కుమార సంభవం"లోని ఒక శ్లోకంలో "న ధర్మ వృద్ధేషు వయః సమీక్ష్యతే" అని అంటాడు.దీని అర్థం ఏమిటంటే ధర్మం తెలిసిన వారిలో వయసు చూడకూడదు అని.అనగా ధర్మం, జ్ఞానం ఉన్నవారిని వయస్సుతో నిమిత్తం లేకుండా గౌరవించాలి.
ఈ సూక్తి శ్లోకం ధర్మం యొక్క గొప్పతనాన్ని మరియు జ్ఞానం ఉన్న వ్యక్తి చిన్నవాడైన అతనికి తగిన గౌరవం ఇవ్వాలి.
అయితే పార్వతికి ఆ జ్ఞానం ఆ చిన్న వయస్సులోనే ఎలా కలిగింది?అనే సందేహానికి సమాధానం కూడా కాళిదాసు ఇలా చెబుతాడు."ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః- "
అనగా పార్వతి వెనుకటి జన్మలో సతీదేవి.దక్ష యజ్ఞంలో తన భర్త అయిన శివునికి జరిగిన అవమానాన్ని భరించలేక అక్కడే తన అంతరగ్నిని ప్రజ్జ్వలింప జేసి అందులో శరీరాన్ని ఆహుతి చేసుకుంటుంది. "శరీరం ఆహుతై పోయినా ఆనాటి సంస్కారాలు జీవాత్మను అనుసరించి వస్తాయని, పార్వతీ దేవికి అలాగే వచ్చాయనేది కాళిదాసు గారి మాటల ద్వారా ఇక్కడ మనం గ్రహించవచ్చు.
ఇదే విషయాన్ని భగవద్గీతలో ఈ శ్లోకం ద్వారా చెప్పడం చూస్తాం.
"తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దేహికమ్!/యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన!!"- అనగా ఇటువంటి జన్మ పొందిన తరువాత ఓ కురు వంశస్తుడా, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి,యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు.
అనగా ప్రతి ఒక్క ప్రాణి హృదయంలో ఉన్న భగవంతుడు వారికి పరిపూర్ణమైన న్యాయము చేస్తాడు.పూర్వ జన్మలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదలు - వైరాగ్యం, జ్ఞానము, భక్తి, విశ్వాసం, సహనము,ధృడ సంకల్పములతో పాటు ఇతర దైవీ గుణాలను పూర్వజన్మల ఫలితాన్ని తిరిగి ఇస్తాడని ఆధ్యాత్మిక వాదులు చెబుతుంటారు.
ఇలా అతి చిన్న వయసులోనే నచికేతుడు యముడి ద్వారా మరణానంతర జీవితము మరియు బ్రహ్మ జ్ఞానం పొందుతాడు.
అలాగే పదకొండు సంవత్సరాల వయసులోనే ధర్మం మరియు జ్ఞానాన్ని శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి తెలుసుకుంటాడు.ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న వయసులోనే జ్ఞానులుగా పేరు పొందిన వారిలో శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీచైతన్య మహా ప్రభు,శ్రీ శంకరాచార్య, వివేకానందుడు లాంటి వారు ఎందరో మన దేశంలో ఉన్నారు.
మొత్తంగా ఈ "న ధర్మ వృద్ధేషు వయః సమీక్ష్యతే "న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ధర్మం జ్ఞానం తెలుసుకోవడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదని, అలా జ్ఞానులు అయిన వారు వయసుతో నిమిత్తం లేకుండా గౌరవం పొందుతారని తెలుసుకున్నాం. అలాగే వయసుతో నిమిత్తం లేకుండా మనమూ ధర్మం మరియు జ్ఞానార్జన చేద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి