నా మొదటి జ్ఞాపకం అయిదేళ్ళ ప్పుడు మా నాన్న నన్ను కొట్టడం, రెండో జ్ఞాపకం ఆయన నన్ను కొట్టడం, మూడో జ్ఞాపకం మళ్ళీ కొట్టడం, ఇంతకన్నా కొడితే ఈ అర్చకుడు చచ్చిపోతాడేమోననే భయంతో ఆపేవాడు. ఆయన దేవుణ్ణి ఏదన్నా వరమడిగితే నిరంతరం వీడ్ని కొట్టే వరమియ్యమని అడుగుతాడు. ఆ మధ్య ఓ సంవత్సరం ఆయనే చదువు చెపుతానని బడి మాన్పించాడు. పాఠాలు చెప్పమంటే ప్రశ్నలడిగి కొట్టడం, మా నాన్న అంటేనే ద్వేషం నాకు. ఆ నాన్న నించి వీలైనంత తప్పుకు తిరిగే వాణ్ణి. ఇంట్లో దాక్కునే వాణ్ణి. ఆ ద్వేషం జీవితమంతా నిలిచిపోయింది. ఈనాటి వరకు గూడ ఆయన్ని నాన్న అని గాని, ఇంకేమని గాని పిలిచి ఎరుగను. అంత అసహ్యం.
- ఈ మాటలు చలంగారివి.
అమ్మకు జేజే, నాన్నకి జేజే, గురువుకి జేజే అనే శీర్షికతో 2011 డిసెంబరులో వెలువడిన పుస్తకంలో నించి తీసుకున్నాను.
చలంగారు తన తండ్రిని "నాన్న" అని పిలిచేవారు కాదుగానీ తిరువణ్ణామలై లోని రమణస్థాన్ (చలంగారి నివాసం) లో చలంగారిని "నాన్న" అని మేమనేవారం. అదొక ఆనందం.
ప్రతి వేసవి సెలవులకి మాకు చలంగారు మా నాన్నగారికి ఎప్పుడు వస్తున్నారని కార్డు రాయడం, మేము ముగ్గురం వెళ్ళేవారం. దాదాపు ముప్పై నలబై రోజులుండే వాళ్ళం. మా చిన్నప్పుడు నాకు తెలిసిన ఊళ్ళు రెండే. అవి మద్రాసులో మేముండిన టీ. నగరు. రెండవది తిరువణ్ణామలై. ఈ రెండు తప్ప మరే ఊరూ ఎరగను. చలం గారి రూపం బాగా గుర్తు. ఆయనతో సహా అందరం కలిసి గిరిప్రదక్షిణ చేయడం గుర్తు. రమణాశ్రమం దగ్గరి పల్లాకుత్తు గుర్తు. రమణాశ్రమం గుర్తు. చలం గారింటి నుంచి గుర్రబ్బండిలో సినిమాకెళ్ళడం గుర్తు. భోజనాలు తర్వాత బసవరాజుగారు సైకిల్ మీద పోస్టాఫీసుకి వెళ్ళి ఉత్తరాలు తీసుకురావడం గుర్తు. ఒక హాలులో సౌరీస్ గారు, చలంగారు ఇలా అందరం కూర్చోగా ఉత్తరాలు చదివితే వినడం గుర్తు. చలం గారు చెప్తుంటే చిక్కాల కృష్ణారావు గారు ఉత్తరాలు రాయడం గుర్తు. కొందరికి చలంగారే స్వయంగా ఉత్తరాలు రాయడం గుర్తు. రాత్రిపూట భోజనాలయ్యాక సౌరీస్ గారు హార్మోనియం వాయిస్తూ పాడటం గుర్తు. భోజన చేయడం గుర్తు. చలంగారింట రెండు నెమళ్ళుండటం (వీటిలో ఒక దాని పేరు హీరా అని గుర్తు) గుర్తు...ఆవరణలో ఓ చెట్టుకి ఉయ్యాలుండేది. దాని మీద ఊగటం గుర్తు....చలంగారింటెదురుగా ఉన్న కొండను అలవోకగా ఎక్కి స్కందాశ్రమాన్ని సందర్శించడం గుర్తు...
ఇలా ఎన్నెన్ని గుర్తులో...
ఏదెలా ఉన్నా చలంగారింట గడిపిన ఆ రోజులన్నీ చిరస్మరణీయమే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి