కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
కుక్క...నక్క పోలిక ఒక్కటే..?

ఉప్పు కప్పురంబు
నొక్కపోలిక నుండు
చూడచూడ రుచుల జాడ వేరు..!
పురుషులందు పుణ్యపురుషులు
వేరయా...ఈ లోకాన లేరయా
విశ్వదాభిరామ వినర వేమ..!

అని వేమన్న చెప్పింది
సత్య దూరం కాదు అది 
నగ్న సత్యానికి ఓ అగ్ని సంతకం
దేనినైనా...ఎవరినైనా  
రంగు రూపు రుచి ద్వారా వాటి
ప్రతిభను సామర్థ్యాన్ని గుర్తించవచ్చు 

కాకి...కోకిల రంగు ఒక్కటే
కానీ కంఠస్వరాలే వేరు
ఉదయాన్నే కావు కావు మంటూ 
అరిచే కాకిని అందరూ 
అసహ్యించుకునే వారే.!

కొమ్మల్లో కూర్చొని 
కుహూ కుహూ అంటూ
కూనిరాగాలు తీసి
మనసును మురిపించే 
కోకిలకే అభిమానులు ఎక్కువ..!

కుక్క నక్క పోలిక ఒక్కటే
కానీ టక్కరి నక్కలనెవరూ
ఇంటికి కాపలాగా పెట్టుకోరు..! 

కడుపు నింపే 
యజమానిని విశ్వాసంతో
కంటికి రెప్పలా కాపాడే
శునకాలనే అందరూ 
ఇంటికాపలాగా పెట్టుకుంటారు..!



కామెంట్‌లు