ఓ బావ :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
వస్తా వస్తా ఓ బావ 
కురులిరబోసుకోని
జరిలంగ వేసుకుని 
బిర బిర నే వస్తాను 

సంతకు నేను వెళ్తాను 
ముంతెడు గంజిస్తాను 
గుంత నిండా పోస్తాను 
కొంత గంజి తాగు బావ 

పూత గంధం పూస్తాను 
చేతికి రంగు వేస్తాను 
కాలికి గజ్జలు కడతాను 
చెంగుచెంగునెగురు బావ 

బుంగమూతి పెట్టకు బావ 
జంగలు వేసి నడువు బావ 
సంగడి బొంగరమోలే నీవు
గుండ్రాగా తిరుగు బావ !!


కామెంట్‌లు