సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
================
కవితలో పొంగుతోంది ఆవేశం,
అంచులు దాటుతోంది వేగం!
ఆరంభం కాదిది,
అనుకోని అద్వితీయ పోరాటం!
అందుకుంది ఆశాజనిత కవనం,
క్షణక్షణాన ఉత్తుంగ తరంగాలలా!
ఉద్వేగాల మధ్య
ప్రపంచ దర్శనం...
నినాదం –
నిర్మిత అక్షర ఆయుధం!
గగనతలిని స్పృశించి,
భువనతలం దర్శించి,
నింపుకుంది –
ఉద్వేగ భరిత ఉత్తేజ కవనం!
మారే కాలం కాదు,
మాటల ఆయుధం!
ధీర, వీర
భాషణా సంస్కృతి సృజించు!
అందరి హృదయాలు
ఎగసి ఎగసి పడగా,
విప్లవ గానం
దిశాదిశల మారుమ్రోగంగా!
కవితావేశాన
ధరిత్రి గడ గడలాడగా,
వణికించగా ఫృధ్వినే –
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి