భారత దేశ తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూకి బాలలన్నా గులాబీలన్నా ఎంతో ప్రియం.
బ్రిటిష్ జర్నలిస్టులతో మాట్లాడేటప్పుడు ఆయన చేతిలో గులాబీ పువ్వు తప్పనిసరిగా ఉండేదట. ఆయన వారితో మాట్లాడుతున్నంత సేపూ గులాబీ పరిమళాన్ని ఆఘ్రాణించే వారట. ఇంతకూ ఆయన ఎందుకలా చేసే వారిలో తెలుసా? అంటూ ఒకానొకప్పుడు ఓ వార్త బయటకు వచ్చిందంటే. 19వ, 20వ శతాబ్దాల ప్రారంభంలో బ్రిటిష్ వారి నుంచి ఓ రకమైన దుర్వాసన వచ్చేదని తరచుగా చెప్పుకునే వారట. ఫ్రెంచ్, బ్రిటిష్, అమెరికన్ల గురించి ఆగ్నేయాసియా ప్రజలకు ఇలాంటి అభిప్రాయం ఉండేదట. ఈ దుర్వాసనకు కారణం వారు సగం ఉడికిన మాంసం తినడం, పాలు తాగడం వల్ల ఓ రకమైన వాసన వచ్చేదట. ఆ దుర్వాసనను అధిగమించడం కోసమే నెహ్రూ గులాబీ పరిమళాన్ని ఆఘ్రాణించే వారట. అరుదైన ఫోటోలు ప్రచురించడం లో తనకౌటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్న పత్రిక " లైఫ్ ". ఈ పత్రిక 1947 మే 19వ తేదీ నాటి సంచికలో ప్రచురించిన నెహ్రూ ఫోటో ఇది. గులాబీతో నెహ్రూ ఉన్న మొదటి చిత్రం ఇదే కావచ్చని అంటుంటారు. అప్పట్లో అందరినీ ఆకట్టుకున్న ఫోటోలలో ఇదొకటి. ఆయన తరచుగా గులాబీతోనే కనిపించే వారు.
లైఫ్ మ్యాగజైన్ నెహ్రూ గులాబీని వాసన చూస్తున్న చిత్రం అంటూ ఇలా పేర్కొంది. "అత్యంత ప్రసిద్ధ బ్రాహ్మణుడు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను ఇటీవల హిందూ - ముస్లిం సంబంధాలపై బ్రిటిష్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు. రాజకీయాలను వివరిస్తూ ఆయన సున్నితంగా గులాబీ పరిమళాన్ని ఆఘ్రాణించారు."
ఫోటో జర్నలిజానికి ప్రసిద్ధి చెందిన పత్రిక "లైఫ్". మొదటగా 1936 నవంబర్ 23న హెన్రీ లూస్ దీనిని వారపత్రికగా ప్రచురించారు. ఈ పత్రిక 1972లో "వార" వీక్లీ ప్రచురణను నిలిపివేసి మాస పత్రికగా మారింది.
చివరికి 2000లో దీని ముద్రణ ఆగిపోయింది.
నిజానికి "లైఫ్" మొదట్లో అనగా 1883లో హాస్య పత్రికగా ప్రారంభమైంది. కానీ 1936లో హెన్రీ లూస్ ఫోటోగ్రఫీపై దృష్టి సారించి అద్భుతమైన ఫోటోలతో వారపత్రికగా వెలువడింది. ఈ పత్రిక రెండవ ప్రపంచ యుద్ధం, కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం, ఇతర ప్రధాన సంఘటనల చిత్రాలను ఎన్నింటినో పాఠకలోకానికి అందించింది. ఫోటో జర్నలిజానికి ప్రసిద్ధి.
మార్గరెట్ బోర్క్-వైట్ , గోర్డాన్ పార్క్స్, రాబర్ట్ కాపా వంటి 20 వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్లు ఈ పత్రిక కోసం పని చేశారు.
లైఫ్ పత్రిక భారీ సర్క్యులేషన్ తో నడిచింది. ఆరోజుల్లోనే ఈ పత్రికకు లక్షలాది మంది పాఠకులుండేవారు. అమెరికన్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే 1970లలో, పాఠకుల సంఖ్య తగ్గడంతోను, ఆర్థిక సవాళ్ల కారణంగానూ లైఫ్ వారపత్రిక కాస్తా నెలవారీ ప్రచురణగా మారింది. చివరికి 2000లో పూర్తిగా ఆగిపోయింది. టైమ్ ఇంక్ పేరుతో 2004లో ఈ పత్రిక మళ్ళీ వచ్చింది కానీ 2007లో ఆగిపోయింది.
లైఫ్ పాత సంచికలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి