సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
============
మనుషులను
జంతువులకన్నా హీనంగా
పరిగణిస్తున్న ముష్కరులు.
నిరు పేదల కష్టాన్ని దోచుకుని
అష్ట ఐశ్వర్యాలు అనుభవిస్తున్నారు
పాపిష్టి పాలకులు.
మన్నెం ప్రజల కష్టాలను
స్యయంగా చూసి
మనసు కలతజెంది
వారికి విముక్తి కలిగించాలని
దేశానికి స్వాతంత్ర్యం రావాలని
సమరానికి దిగిన
విప్లవ కెరటం అల్లూరి....!!
ఎంత ఆశ చూపినా లొంగక
బ్రిటీష్ మూకలనెదిరించాడు..!
మంచిగ సంధియని పిలిచి
వంచనతో తీశారు ప్రాణం
అదొక ఆరని అరుణ కిరణం..!
కోటికొక్కరు పుడతారు
ప్రజల కోసం పాటు పడతారు.
మానవ జాతి వున్నంత వరకు
అజరామరం నీ కీర్తి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి