తెగింపు:- జంజం కోదండ రామయ్య- జమ్మిపాళెం
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
============
తొలకరి చినుకులు తాకిన
హృదయము ఉప్పొంగి
పులకించి పరవశించు మేను
అలాంటిదే తొలి ప్రేమ...!!

మాయని మమతలు కురిపించి
మరో లోకంలో విహరించి
ఇదే శాశ్వత మని
మైమరచి పోయేదే తొలి ప్రేమ...!!

ఎవరు అడ్డు వచ్చినా
ఎన్ని ఆటంకాలు ఎదురైనా
కన్నవారు కాదన్నా
తమ ప్రేమ కాపాడుకునేందుకు
దేనికైనా సిద్దపడి
నిలబడేదే నిజమైన తొలి ప్రేమ...!!!

ఒకరిని ఒకరు విడిపోలేని
మధురిమలొలికే
మమకారాలు వారివి
కట్టుబాట్లు ఈ సమాజం
వారికి ఓ గడ్డిపోచ...!!!


కామెంట్‌లు