నాయనా శివా!
ఈ అమ్మ మాటను ఆలకించుము.
ఈ మాటలు నానోట మన ఇలవేల్పు 'తుల్జా భవానీమాత' పలుకించుతున్నదని విశ్వసింపుము.
నాయనా శివాజీ!
మన హిందూధర్మ దేవత ఈనాడు
కంటికి కడివెడి నీరుగా దుఃఖించుచున్నది.
కోటానుకోట్ల వీరపుత్రులు కలిగిన నేను, ఈనాడు సుల్తానుల,నవాబుల, మ్లేఛ్ఛుల చెరబడితిననుచూ,
తన అవమానానికి కారకులైన
ఆ దుష్టులను తెగనాడి, తన సంపూర్ణస్వాతంత్ర్యానికి పాటుపడే ఒక్కడంటెే ఒక్క బిడ్డడుకూడా లేడా అనుచూ ,
కంటికి కడివెడు నీటితో పరితపించుచున్నది.
నాయనా శివబాలా!మీ నాయన షాజీ, అరివీర భయంకరుడు అయినప్పటికినీ, హిందూధర్మాన్ని అణగద్రొక్కుతున్న,అవహేళన చేయుచున్న ,అంతముచేయబూనిన ఆ నవావాబుల కొలువులలో, నాతండ్రివలెనే నీతండ్రికూడా ఆ దురాత్ములు ఎరవేసిన భోగభాగ్యాలకు,సిరిసంపదలకూ ఆశపడి సైన్యాధికారిగా ఊడిగంచేయుచున్నాడు.అలా చేయవద్దనీ , మనకున్న పరగణాలను పాలించుకొంటూ, సుఖంగా వుందామని అనేక విధాల బ్రతిమిలాడినా,నా మాటను పెడచెవినిపెట్టి,
నిండుగర్భిణినైన నన్ను విడచిపెట్టి, నాతొలుచూలుబిడ్డ,నా కనులపంట, శంభూజీని నావడినుంచి వేరుజేసి, నీ హిందుధర్మం,నీహిందూ మతాన్నీ నీనెత్తిన పెట్టుకు ఊరేగమని
నిర్లక్ష్యగా వెళ్ళిపోయేరు.
ఆసమయంలో అనాధలా అలమటిస్తున్న నన్ను కన్నతండ్రికన్న మిన్నగా,
ఆదరించిన దాదాజీఖండదేవ్,ఈనాడు నీకు తాతగా, నీభవితను గురువుగా చక్కదిద్దుటయేగాక,నీద్వారా హిందూ ధర్మాన్ని పునరుత్తేజపరచి,యావత్ భారతంలో హిందూరాజ్యం పూర్వవైభవంతో నెలకొల్పవలెనని ,హిందూ ధర్మానికి పునరుత్తేజం తేవాలనీ ,వేయికళ్ళతో ఎదురుచూచుచున్నారు.
ప్రతినిత్యము సుల్తానులపాలనలో దేశవ్యాప్తంగాలక్షలాది హిందువులకు జరుగుతున్న అన్యాయం,హింస ఇంతని వివరించగలుగలేముకదా తండ్రీ!
నాయనా శివా! యావత్ భరతఖండం నీవు ఈ అన్యాయాలను ఎదిరించి, భరతమాతకు కల్గిన ఈ అమానాన్ని పరిమార్చి,హిందూధర్మరక్షణ చేయగలవన్న ఆశతో వేయికన్నులతో ఎదురుచూచుచున్నది.
నీకు మన ఇలవేలుపు తుల్జా భవానీ మాత ఆశీస్సులు గురువులు దాదాజీ ఖండదేవ్ ,సమర్థరామదాసులఆశీర్వాదాలూ సమృధ్ధిగాయున్నవి.లే నాయనా శివయ్యా!భవానీ నీకొసగిన ఖడ్గం చేతపట్టు.ఈ పరమ కిరాతకమై ధర్మదూరులైన ఈ ముష్కర పాలనను అణచివేయి.అంతం చేయి.నిన్ను కన్నతల్లిగా ఇది నా అభ్యర్థన.మన భవానీ మాత ఆజ్ఞ కూడా ఇదే!
నినదించు శివా అఖండ భారతావనికీ జయహో అని.జైజై తుల్జాభవానీమాతకు జయహో అనీ. నినదించు. పట్టు ఖడ్గాన్ని,
పరిమార్చు హిందూధర్మద్రోహులను.
జయం నీదే .విజయీభవ!
దిగ్విజయీభవ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి