బాల్యంతో మొదలు జీవం ఉన్నంత వరకు సాగేది స్నేహం
మంచి చెడులు కానక చెంతన చేరేది చెలిమి
లాభం నష్టం కొలతలు ఎరగని బేరసారాలు చేయలేనిది మిత్రబంధం
అమ్మానాన్నల కన్నా మిన్నా
మనస్సుకు చేరువ చేరి దాపరికం తెలియని ఒకరికి
ఒకరై నిలిచే మనస్సే స్నేహం
కలిమి లేములు కానరావట
బీదాగొప్ప భేదం లేదట మాటా మంచి మించినది
లేదను బంధం మైత్రి
పేరు ప్రఖ్యాతులు అడ్డుకావులే ఆదరణే ఆదర్శం గలదది పేర్మి
ఇష్టం చూపుట,కష్టం పంచుట, సంతోషం రెట్టించుట ఒక్కరితోడనే
జరిగేనంట నేస్తం జంటేనంట
మాటలు,పాటలు,ఆటలు
మనస్సున రంజించు సాంగత్యము
పిలిచిన పలుకును ,పలుకే బలమగు
ఏ బలగము చేరదు కష్టకాలమున
ఓదార్పును కూర్చును హార్ణము
సహోదరుల సాటిగా నిలచి ఆనందం
పంచగ నేనున్నానంటూ చేయ్యందించును నెయ్యము
మిత్రుల చెంతన చేరిన చాలును
నా కెవరూలేరును భావము మరణించును మైత్రి చేతిలో
పొత్తు కుదరకపోయినా పొరపాటున కూడా నిందించరు
మిత్రుని అనురాగమున ముందర కోల్పోయినదేది
ప్రియమనిపించదు ప్రియమైనది ప్రియము కదా
బాధలో , బంధంలో, అనుబంధంలో, ముందుండేది స్నేహబంధం.
స్నేహబంధం: - పి.శ్రీదేవి. -హైదరాబాద్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి