కొత్తూరు మండలం, కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా బదిలీపై వెళ్లి, అక్కడ రెండేళ్ళు పనిచేసి, నేడు పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలకు బదిలీ కాబడిన కుదమ తిరుమలరావు, ఆ కడుము ఉన్నత పాఠశాలను జ్ఞాపకం చేసుకుంటూ అది ఒక మమతల కోవెల వంటిదని అభివర్ణిస్తూ తన అభిప్రాయాలు వెల్లడించారు. కడుమున తన రెండేళ్ల అనుభవాలను అందరితో పాలుపంచుకుంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు. వార్షికోత్సవం వేదికపై ఏ వైపు చూసినా పిక్నిక్కు స్పాటే, ఏ జన్మ బంధమో అనిపించు గ్రేటే, కడు ముదావహంబురో, కడుము హైస్కూలురో, కడు ముత్యాల పందిరి, కడు ముదంబులీ సిరి అంటూ స్వీయ గీతాన్ని ఆలపిస్తుంటే ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, బోధనేతర సిబ్బంది మహారథి పాత్రో, సుస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు ఎంతగానో విద్యార్థులతో పాటు హర్షాతిరేకాలు వ్యక్తం చేసి, తనను ఉత్సాహపరిచారని తిరుమలరావు అన్నారు. రెండో వార్షికోత్సవ వేదికపై అదిగదిగో కిడిగాం మెట్ట ఒరియా స్పాటు, అల్లదిగో హడ్డుబంగి ఒడిశా స్టేటు,
రెండూళ్ళ నడుమున ఉంది కడుము ఆంధ్రం, మెండైన హైస్కూలుంది హైలెట్ కేంద్రం, స్టూడెంట్సు తీరు మంచి, అది అంతకుమించి, పేరెంట్సు సాయం నిత్యం, బడి గుడిగా భావించి, ఆ హెచ్చెమ్ ఎండూ స్టేఫు బహు చక్కగా బోధించి, అన్నిన్ను కలిసొచ్చి, కడు ఉన్నతమైన చదువులు పంచి అంటూ స్వీయ గీతాన్ని ఆలపించిన తనకు ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావుతో పాటు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది మిక్కిలి అభినందిస్తూ సంతోషపరిచారని ఆయన అన్నారు. పాఠశాల ప్రగతికి సమాజ భాగస్వామ్యం ఎల్లవేళలా అందజేయుట ఆ ప్రాంతవాసుల మంచితనానికి, ఆదర్శవంతమైన పాఠశాల పనితీరుకు అద్దం పడుతుందని ఆయన కొనియాడారు. వందలాది చెట్లతో, పూల మొక్కలతో, అందమైన భవనాలతో, రెండు వేదికలతో, ఆరెకరాల విస్తీర్ణంలో చుట్టూ ప్రహరీగోడతో, పటిష్టమైన ఎంట్రన్సు గేటుతో, విశాలమైన ఆటస్థలంతో ఊరికి దూరంగా ప్రశాంతతతో, గొప్ప ఆహ్లాదకరమైన వాతావరణం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సొంతమని ఆయన అన్నారు. అట్టి పాఠశాలలో కొద్ది కాలమైనా పనిచేయుట కచ్చితంగా పూర్వ జన్మ సుకృతమేనని తిరుమలరావు తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఆ పాఠశాలలో చేరిన తొలి నాలుగు నెలలకే వోని యు.పి.పాఠశాలకు పని సర్దుబాటు తాత్కాలిక బదిలీ అయి మరలా కడుములో చేరానని అన్నారు. రెండవ యేట కూడా కడుములో పనిచేసిన తొలి నాలుగు నెలలకే పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలకు పని సర్దుబాటు తాత్కాలిక బదిలీ అయి మరలా కడుములో చేరానని అన్నారు. పేరుకే కడుము హైస్కూల్లో రెండేళ్ల సేవలుగానీ, ఎనిమిది నెలలు మాత్రమే బోధన గావించానని తిరుమలరావు అన్నారు. కడుములో పనిచేస్తూయుండగా మరో రెండు పాఠశాలలకు పంపబడే విచిత్రమైన పరిస్థితి తనకు మాత్రమే ఎదురైందని, ఆయన అన్నారు. ఇదిలా ఉండగా కడుము గ్రామం, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో ఆ రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాలను వివిధ సందర్భాల్లో సందర్శించే భాగ్యం కలిగిందని తిరుమలరావు అన్నారు. పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్, రమణగూడ, తెరుబలి, తమరాడ, బూదురు, హడ్డుబంగి, కిడిగాంలనే ఒడిశా రాష్ట్రపు ప్రాంతాల జాతరల, వినోదాల పర్యటనలు జన్మలో మరువరానివని అన్నారు. బలద, పాతపట్నం, లివిరి, పాతపాడు, వసప, మెట్టూరు, దిమిలి, నివగాం, హంస, సీది, కౌశల్యాపురం, పారాపురం, జోగిపాడు, కొరసవాడ, హిరమంలం, టెక్కలివంటి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాలు కూడా పలు సందర్భాల్లో సందర్శించే భాగ్యం కలిగిందని తిరుమలరావు అన్నారు. పర్లాకిమిడి రాజులు, గుణుపూర్ రాజులు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్చించుకునేలా ఒకరికొకరు కలుసుకునేందుకు గుణుపూర్ నుండి నౌపడ వరకూ నిర్మించిన మీటర్ గేజ్ రైల్వే రోడ్ వెంబడి తామ చేసిన టూ వీలర్ ప్రయాణం రమణీయమగు స్మృతికావ్యమని ఆయన అన్నారు. ఆ రోడ్డు నేడు కేంద్ర ప్రభుత్వం అధీనమైందని, పట్టాల మద్య ఉన్న మీటర్ గేజ్ వెడల్పు పెరిగి, బ్రాడ్ గేజ్ ఐందని, ఆ దారి పొడవునా ఉన్న తారు రోడ్ ఆల్ ఆంధ్రా రోడ్ మీదుగా కడుము లెక్కల మాస్టారైన జి.వి.భాస్కరరావుతో ప్రయాణించే సమయంలో అతని ద్వారా ఆనాటి సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోగల్గానని అన్నారు. కొండకోనలు, గుట్టలు, లోయలు, వాగులు, అడవుల మీదుగా ఆ రైల్వే ట్రేక్ నిర్మాణం తనకెంతో అబ్బురపరిచిందని, మన్నెం, గూడెం, మారుమూల గ్రామాలవద్ద రైళ్ళు ఆగుట, ప్రజల రాకపోకలకు చక్కని సౌకర్యమిచ్చుటనేది, నిర్మించిన ఆనాటి పర్లాకిమిడి రాజుల పుణ్య ఫలమని తిరుమలరావు అన్నారు.
కడుము ఉన్నత పాఠశాల విద్యార్థులు యోగాసనాల పోటీలో రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచారని, వారి గురూజీ కాశీనగర్ హరీష్ సమక్షాన సదరు ఆసనాల ప్రదర్శనలు, పి.డి.సార్ జె.చిన్నయ్య తర్ఫీదులో అత్యద్భుతమైన పిరమిడ్ గేమ్స్ ప్రదర్శనలు చూసి ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడినగుట మిక్కిలి గర్వకారణంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇలాంటి అనుభూతి తాను గతంలో పనిచేసిన ఏ పాఠశాలలోనూ లభించలేదవి తిరుమలరావు ఆనందభాష్పాలతో వివరించారు.
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పొందియున్న తనను కడుము ఉపాధ్యాయ దినోత్సవ వేదికపై ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, తోటి బోధన, బోధనేతర సిబ్బంది ఘనంగా సన్మానించడం తన జీవితంలో తనకెంతో సంతృప్తినిచ్చిన సత్కారమని ఆయన గుర్తుచేసుకున్నారు. పాఠశాల ఆటస్థలంలో మొక్కల నాటింపు, కూరగాయల పెంపకం వంటి అభ్యుదయ కార్యక్రమాలు నేషనల్ గ్రీన్ కార్ప్స్ టీచర్ టి.సురేష్, వ్యాయామ ఉపాధ్యాయుల జన్ని చిన్నయ్య, సాంఘిక శాస్త్రోపాధ్యాయులు గుంటు చంద్రంల సహకారంతో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు ఆధ్వర్యంలో నిత్యమూ జరిగాయని, తనకు కూడా ఆ సేవలలో భాగస్వామ్యం కల్గుట దేవుడిచ్చిన వరమని ఆయన అన్నారు. కడుము హైస్కూల్ లోనే రెండు రోజుల పాటు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహణ, బహుమతి ప్రదానం వంటి వేడుకలు తన ఉద్యోగ జీవితంలో మధురమైన సుందర దృశ్యకావ్యాలని తిరుమలరావు కృతజ్ఞతా భావంతో తెలిపారు. అంతేగాక నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నివగాంలో జరుగగా ఆ ముగింపుసభలో కడుము హైస్కూల్ తరఫున ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు తాను కూడా పాల్గొని, బహుమతి ప్రదానం గావింపు మరో ఆనందకరమని అన్నారు. కొత్తూరు మండల విద్యాశాఖాధికారి కార్యాలయం ఆవరణలో జరిగిన అంబేద్కర్ విగ్రహప్రతిష్ఠ సభకు ఆహ్వానం పొందుట, భారతజాతి బంధువై, భవిత కూర్చు బంధమై, ధన్యమైంది నీ కథనం, బిఆర్ అంబేద్కరా వందనం అను స్వీయ గీతాన్ని ఆలపించి, అంబేద్కర్ చిత్రపటంతో సత్కరించబడుట ఒక తీపి కానుక అని తిరుమలరావు తెలిపారు. అదే విధంగా మండల స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించబడుట, టీచరై మన మాస్టరై సర్వేపల్లి స్ఫూర్తిని నింపారు, టీచరై గురుబ్రహ్మయై రాధాకృష్ణన్ కీర్తిని నిల్పారు అంటూ స్వీయ గీతాన్ని ఆలపించి మండల విద్యాశాఖాధికారులు చందక గోవింద, నిమ్మల శ్రీనివాసరావుల ప్రశంసలు పొందుట గొప్ప సంతృప్తినిచ్చిన అంశమని ఆయన అన్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు లోతుగడ్డ తులసీ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సభలో ఘప సన్మానం పొందుట ఒక మహా అదృష్టమని తిరుమలరావు అన్నారు. తన 36సంవత్సరాల సర్వీస్ లో ఏకైక ఉన్నత పాఠశాల కడుము మాత్రమేనని, ఆ రకంగా జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేసే అదృష్టం కలిగిందని చెప్పారు. టెక్కలి డివిజన్ డెప్యూటీ విద్యాశాఖాధికారి జి.పగబాలమ్మ సందర్శన, పాఠశాల పనితీరును ప్రశంసించుట మరో మధుర స్మృతియని అన్నారు. ఈ ఉన్నత పాఠశాలలో హాస్టల్ పిల్లలు కూడా ఉండడంతో ఆ హాస్టల్ కు అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండుట తన ఉద్యోగ జీవితంలో నూతన అంశమని, వాటన్నింటినీ ఎంతో ఇంపుగా ఆస్వాదించానని ఆయన అన్నారు. భోజన సదుపాయం వలన కడుము పొరుగున గల ఒడిశా రాష్ట్రానికి చెందిన కిడిగాం గ్రామానికి వందరోజులపాటు వెళ్లి రావడమైనదవి, ఆంధ్రాలో ఉద్యోగం చేస్తూ, ఒడిశా రాష్ట్రంలో మెలుగుట మరో విచిత్రమైన అనుభవాన్ని తనకు ఈ కడుము మజిలీ ఇచ్చిందని తిరుమలరావు అన్నారు. ఈ తరుణంలో ఆ ఒడిశా రాష్ట్రానికి చెందిన కిడిగాం హైస్కూల్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపించే గొప్ప అవకాశం లభించిందని ఆయన అన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు జరిగిన సందర్భంలో, ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, సహోపాధ్యాయుల కార్యదర్శి తూతిక సురేష్ లతో పాటు, తాను కూడా కీలక భూమిక పోషించి, ఫలితాలు ప్రకటించీ, ప్రమాణస్వీకారం గావించీ, ఎన్నికల ప్రక్రియ సఫలీకృతమొనర్చుట జరిగిందని ఆయన భావోద్వేగంతో వివరిస్తూ గుర్తు చేసుకున్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలో పదవ తరగతి పిల్లలకు బ్యాంకర్స్ సంస్థవారు ప్రతిభాపోటీలను నిర్వహించగా ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు ఆదేశాల మేరకు కిల్లారి దీప్షికాశ్రీ, కె.లావణ్య అనే బాలికలను తాను కొత్తూరు తీసుకుని వెళ్ళి పోటీల్లో పాల్గొనజేసానని, విద్యా సంవత్సరం ఆఖరిలో ఆ ఇద్దరికే ట్రిపుల్ ఐటీ లో సీట్లు లభించుట యాదృచ్ఛికమని తిరుమలరావు అన్నారు. ఇరవైమంది స్టేఫ్ గల కడుము ఉన్నత పాఠశాలలో టీచర్స్ మధ్య ఆటల పోటీలు జరిగినప్పుడు టగ్ ఆఫ్ వార్ లో తాను పాల్గొని, శక్తికి మించి తాడు లాగి లాగి లాగడంతో వారంరోజుల పాటు ఒళ్ళంతా నొప్పులు భరించానని, ఐతే ఆ ఆటలో గల మజాను భలేగా ఆస్వాదించానని తిరుమలరావు జ్ఞాపకం చేసుకుంటూ కంట తడి పెట్టారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి