వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలి

 ఉపాధ్యాయుల బదిలీల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వం ముందుగా ఇచ్చిన మాటకు కట్టుబడి మాన్యువల్ కౌన్సిలింగ్ ని అమలు చేయాలని, వెబ్ కౌన్సిలింగ్ ని రద్దు చేయాలని రాజాం మండల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక మండల విద్యాశాఖా కార్యాలయం ఆవరణలో మండల విద్యాశాఖాధికారి పి ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేసారు. ఈనాటి కార్యక్రమంలో రాజాం మండల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మువ్వల రమేష్, బలివాడ నాగేశ్వరరావు, కరణం బంగారు నాయుడు, సింగుపురం కొండలరావు, వి రామకృష్ణ నాయుడు, బెవర శ్రీనివాసరావు, రెడ్డి మోహనరావు, ఎస్ పైడిరాజు,  పక్కి వాసు, పల్ల మురళి, యలకల భాస్కరరావు తదితరులు ప్రసంగించారు. మేన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు - వెబ్ కౌన్సెలింగ్ రద్దు అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఎట్టి పరిస్థితులలోను వెబ్ కౌన్సిలింగ్ ను అంగీకరించేది లేదని, ప్రభుత్వం మొండివైఖరిని విడనాడి, మాన్యువల్ కౌన్సిలింగ్ ను అమలుచేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సంఘ నాయకులంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంద మందికి పైగా పాల్గొనిన ఈనాటి నిరసన కార్యక్రమంలో నల్ల రవి కుమార్, ఎస్.విజయలక్ష్మి, వై.భవాని, వై.రాజేశ్వరి, కామేశ్వరమ్మ, కె.సత్యవతి, జె.సన్యాశిరాజు, పి.శ్రీకర్, బి రాజు, బి అప్పారావు, శివరాం నాయుడు, సాదెం ఉమామహేశ్వరరావు, కుదమ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం తలపెట్టిన శ్రీకాకుళం డిఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని సంఘ నేతలంతా పిలుపునిచ్చారు.
కామెంట్‌లు