మాటలు
గుబాళింపచెయ్యమంటున్నాయి
పలుకులు
తేనెచుక్కలుచల్లమంటున్నాయి
అక్షరాలు
ముత్యాల్లాగుచ్చమంటున్నాయి
పదాలు
పనసతొనల్లాపసందుకొలపమంటున్నాయి
ఆలోచనలు
పారించమంటున్నాయి
భావాలు
బహిర్గతంచేయమంటున్నాయి
శబ్దాలు
శ్రావ్యతనుకూర్చమంటున్నాయి
పాఠకలోకము
పరవశపరచమంటుంది
కలము
చేతపట్టమంటుంది
కాగితము
బొమ్మనుచెక్కమంటుంది
శైలి
సొంతంచేసుకోమంటుంది
శిల్పం
చక్కగాదిద్దమంటుంది
భాష
తల్లిలాప్రేమించమంటుంది
సాహితి
పుత్రవాత్సల్యంచూపుతుంది
కైతలు
కమ్మదనాలుకలిగించమంటున్నాయి
మదులు
మురిపించమనివేడుకుంటున్నాయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి