దూరపు కొండలు...? (హాస్య కవిత):- కవిరత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్
ఆహా సంబంధం 
అద్భుత సంబంధం
విదేశీ సంబంధం 
వింతైన సంబంధం 
ఆన్లైన్ వివిహం
అబ్బాయి ఆంధ్ర 
అమ్మాయి అమెరికా 

కానీ అది పులి...మేక సంబంధమట...
నిజానికి ఏ పులీ ఏ మేకను పెళ్లాడదు
రెండు కలిసిమెలిసి మేసిన చరిత్ర లేదు
కలిస్తే..? కనిపిస్తే..? మేక...కొరికి  పీక...
తీర్చుకుంటుంది పులి...తన ఆకలిని...

ఔను పూజారి 
వ్రాసిన జాతక చక్రంలో
అబ్బాయి “మేక” అట...
అమ్మాయి “పులి” అట...

పూజారి చెప్పినా పెళ్లి కుదరదని
వియ్యాల వారు కయ్యాలవారు
కయ్యానికి కాలుదువ్వి
పెట్టుడు ముహూర్తంలో
పెళ్లి జరిపించారట..!

ఇంకేముంది...భర్తకు 
శోభనం గదిలో మొదలైన
ఆ మానసిక గృహహింస
వంటగది వరకు ప్రాకెనట..!
పెళ్లి పెటాకులై పేలిపోయెనట..!
పచ్చని కాపురం
మున్నాళ్ల...ముచ్చటాయెనట..!

అందుకే ఓ తల్లిదండ్రులు ఆలోచించండి 
అమెరికా సంబంధాలపై ఆశ పడకండి
మంచిచెడు రోజులుంటాయని మరువకండి 
దూరపుకొండలు నునుపని తెలుసుకోండి 



కామెంట్‌లు