ఆలూరు గ్రంథాలయంలో గద్వాల సోమన్న "సూక్తి చంద్రిక" పుస్తక పరిచయ సభ

 పెద్దకడబూర్ మండల పరిధిలోని,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంబదహాళ్ లో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు డా.గద్వాల సోమన్న "సూక్తి చంద్రిక" పుస్తక పరిచయ సభ శాఖా గ్రంథాలయం,ఆలూరు,కర్నూలు జిల్లాలో,స్థానిక గ్రంథాలయ అధికారి విజయ భాస్కర్ సమక్షంలో ఘనంగా జరిగింది.బాలల కోసం గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసిన "వేసవి పునశ్చరణ కార్యక్రమం" లో భాగంగా ముగింపు సందర్భంగా విశ్రాంత మండల విద్యాధికారిణి, సంఘ సేవకరాలు, బహు భాషాకోవిదురాలు హత్తి బెళగల్లు రామలింగమ్మ మరియు విశ్రాంత డి. పి.ఓ శ్రీనివాసులు గారల చేతుల మీద ఆవిష్కరిస్తూ,పిల్లలకు పరిచయం చేశారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వీరస్వామి,ఈరన్న,దేవదానం,విశ్రాంత మాజీ సైనికుడు నర్సిరెడ్డి,బాటప్ప,విశ్రాంత గ్రంథాలయ అధికారి నీరుగంటి వెంకటేశ్వర్లు,పద్యకవి ఈశ్వరప్ప,తెలుగు భాషోపాధ్యాయులు మల్లికార్జున,మహదేవి మొదలగు వారు పాల్గొన్నారు.కృతికర్త గద్వాల సోమన్నను సాహితీమిత్రులు,ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు.అభినందించారు.
కామెంట్‌లు