గుండెల్లో రగిలేదే విప్లవం.:- రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి
సాహితి కవి కళా పీఠం 
సాహితీ కెరటాలు 
================
అదిగో అల్లదిగో అదిగో 
అల్లదిగో విప్లవ కెరటమై ఉబికి ,ఊబికి వస్తున్నది ,
యువకుల గుండెలలో 
పెను తుఫాను హోరులతో విజృంబించినది .
కెరటాల వెల్లువలో 
సముద్రపు హోరులో 
కడలి మధ్యాన
వాయుగుండమే, సుడిగుండంగా, ఉప్పెనలా
ఉరికి ,ఉరికి వస్తున్నది 
స్వాతంత్ర సమరంలో, ఈ విప్లవ కెరటమే

         


అల్లూరి సీతారామరాజు గుండెల్లో ఎగిసిన కెరటం అయ్యింది .

ఎందరో వీరులకు ఈ విప్లవ కెరటమే ఊపిరిలుగ  ఊదింది .

కడలిన బడబానాలమైతే గాని, విప్లవం ఊపు అందుకోదు .
 రక్త  తర్పణం జరిగితే కానీ విప్లవానికి పట్టు రాదు .
ఉగ్ర వాదానికి ఫలితమే ఆపరేషన్ సింధూర్

     విప్లవమై ఎగిసింది ఆపరేషన్  సింధూర్ గా
అవతరించి భారతీయ వనితల కు రక్తసింధూరంగా అలంకరించింది .
గుండెలలో విప్లవం చెల్లరేగితే కానీ నిప్పు కణికలు  పుట్టవు.
విప్లవ కెరటాలు, కెరటాలుగా విజృంభించే పాకీస్తానీయుల‌ గుండెల్లోదడ పుట్టించింది.

వేల గుండెల్లో రగిలే అగ్నిగుండమే విప్లవం.

కామెంట్‌లు