స్నేహ బంధం : - సరికొండ శ్రీనివాసరాజు

 సృష్టిలో అత్యంత మధురం
అమృతతుల్యం స్నేహం
స్నేహబంధపు విలువ ముందు.
నవరత్నాలు సైతం సాటిరావు  
బాల్యంలో ఆటలూ పాటలూ
అల్లర్లూ కొట్లాటలూ అలకలూ
అన్నీ మరచిపోయి ఏకమవడమూ
సంతోషాలు హాయిగా పంచుకుంటూ
కష్టాల్లో తోడు నీడగా ఉంటూ
కలకాలం కమ్మగా వర్ధిల్లుదురు 
బంధుత్వంలోనూ కనబడును 
ఈర్ష్యా ద్వేషాలు, శత్రుత్వాలూ
నిజమైన స్నేహంలో అవి శూన్యం
ఆనాటి స్నేహాల్లో ఉన్న మధురం
ఈనాటి స్నేహాలలో శూన్యం
సరదాగా అంతా కలసి
ఆట పాటలతో గడిపే సమయం   
టీవీలు, మొబైల్ ఫోన్లకు అంకితం 
సోషల్ మీడియాకే పూర్తి సమయం
పాఠశాలల్లో చదువే సర్వం 
ఆటపాటలు నీతి బోధనలు శూన్యం  
ఇంట్లో పెద్దలు ఎవరి లోకంలో వారు
యువ వయసులో సర్వం సమయం 
తెగిన గాలిపటంలా పయనం
ఏవీ ఆనాటి స్నేహబంధాలు?
ఎవరికి వారే ఒంటరి బతుకులు
సోషల్ మీడియా స్నేహాలతో 
అరుదెంచునా ఆనాటి వైభవం?
మళ్ళీ తెద్దాం పూర్వ వైభవం 
అందుకు చేద్దాం మనవంతు ప్రయత్నం 
కామెంట్‌లు