సాహితీ కవి కళా పీఠం.
సాహితీ కెరటాలు
==================
నవ మాసాలు మోసి,
రక్త మాంసాదులతో
"నన్నో మనిషిని చేసి,"
జీవిత త్యాగానికి సిద్ధపడిన
"నా తల్లి" పై కలిగే తొలిప్రేమ అనన్యం.
తెలియని వయస్సులో — మనసు ముద్రించుకున్న
నాన్న "తొలి స్పర్శ",
నాలో కలిగే తొలిప్రేమే.
అక్క "అనురాగం",
అన్న "అనుబంధం" —
రెండూ
ఏ కవికలానికి అందని తొలిప్రేమలే!
కథలు చెప్పే నా తాతగారి పరమార్థాలపై,
ఈ మనసుకెందుకో తొలిప్రేమ!
తాతగారి ఇంట్లో,
అమ్మమ్మ చీవాట్లైనా —
"ఆ ఇంటిపై" నాకు కలిగే తొలిప్రేమ ఊహాజనితం!
బుడిబుడి అడుగుల సవ్వడిలో
మాస్టారి కర్ర,
లేత శరీరాన్ని కందించినా —
నన్ను స్థాయికి తెచ్చిన
"ఆ గురువు" పైనే నా తొలిప్రేమ!
ఊహలకు రెక్కలు వస్తున్న కాలంలో,
"నా ఊహాసుందరి" పైనే నా తొలిప్రేమ.
వృత్తి నిర్వహణకు
కాలు మోపిన
"కార్యాలయ ప్రాంగణ నేలతల్లిపై" ఎనలేని తొలిప్రేమ.
నా చుట్టూ ఉన్న ప్రకృతిపై
నాకు కలిగే తొలిప్రేమ —
వర్ణనాతీతం.
నా తొలి చూపులలో చూసే
నా అర్ధాంగి పై,
నా తొలిప్రేమ "ఊహలకు" అందనిది.
"నా అనుకున్న వారిపై" కలిగే
నా ఈ తొలిప్రేమను తలుచుకుంటున్న
ఈ హృదయం —
ఆనంద పారవశ్యంతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి