సాహితీ కవి కళా పీఠంసాహితీ కవి కెరటాలు==================అన్యాయం , అణిచివేత ,ఆత్మగౌరవానికి ఆటంకం,అసంతృప్తి గూడు కట్టిన ఆ క్షణo.... ,నర నరాలలో ఉప్పొంగినపౌరుషం ,సహనశీలి గుండెల్లోరగిలిననిప్పుకణం, అదే అదే కదా విప్లవం!బానిసత్వము పెత్తందారి పెత్తనాలు ,సామాజిక అసమానతలు ,భూస్వాముల అహంకారాలు ,ఇదే కదా విప్లవానికి నాంది !స్వేచ్ఛ స్వాతంత్రాల ఆకాంక్ష ,నిస్సహాయతను పాతర వేయడం ,బానిస సంకెళ్లను తెంచివేయడం ,గౌరవాన్ని కాపాడుకోవడం ,ఇదే ఇదే విప్లవ వీరుల అజెండా.పెట్టుబడి లేని ఆయుధం ,ఆయుధం లేని యుద్ధం ,ఎలుగెత్తి చాటే స్వరందిక్కులు పిక్కటిల్లె నినాదాలు,అణువణువునా నింపుకున్న త్యాగం ,విప్లవానికి బలమైన సైన్యం.బానిస బ్రతుకులు వద్దు వద్దు ...ఆత్మగౌరవంతో బ్రతుకుట ముద్దు ...విప్లవాలతో మన ఉనికి చాటుట కద్దు..,.,రక్తపాతాలు వద్దు వద్దు వద్దు.
ఆత్మగౌరవం :- పార్లపల్లి నాగేశ్వరమ్మ -నెల్లూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి