ఏమిటీ యుద్ధోన్మాదం?:- కవిమిత్ర, సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం
శాస్త్ర సాంకేతికత పెరిగిందని
ప్రపంచమంతా అరచేతిలోనే చూస్తున్నామని
సముద్ర గర్భంలోకి అంతరిక్షంలోకి
పురుషులతో సమానంగా స్త్రీలు అభివృద్ధి చెందారని
వసుదైకాన ప్రజలంతా సోదర సమానులని
యుక్తాయుక్త విచక్షణ ఉందని
చెబుతున్న ఓ మనిషీ

నేడు సమాజాన జరిగే అరాచకాలే కాదు
మానవత్వం మరచి మరణ మృదంగానికి కారణమవుతున్న
ఒకదేశం పై వేరొక దేశపు ఆధిపత్యం కొరకు జరిగే
యుద్ధవాతావరణంలో  వేలాదిమంది
ధన మాన  ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 
పరిస్థితులు చూస్తుంటే
రాతియుగపు సమాజమే నయమనిపిస్తోంది.

భర్తను కోల్పోయి భార్య
 తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలైన పిల్లలు  ఎంతో కష్టపడి నిర్మించిన భవనాలు విద్యాలయ ప్రయోగశాలలు నాశనమయి మరుభూమిలు గా మారుతుండడం చూస్తే
శాంతి దూతలు ఏసుక్రీస్తు, మహాత్మా గాంధీ, మహమ్మద్ ప్రవక్త వంటి
మహనీయులు కోరుకున్నది ఇప్పటికైనా నెరవేరిందా
ఏమిటీ యుద్ధోన్మాదం?
దీనికి అంతమెప్పుడు
విజ్ఞులు, ప్రాజ్ఞులు ఒక్కసారి ఆలోచించండి.!!

( నేడు రష్యా, ఉక్రేయన్
ఇరాన్, ఇజ్రాయెల్  అలాగే బంగ్లాదేశ్ లో మత విద్వేషం , మారణ కాండ ఎన్నో ప్రపంచాన జరుగుతున్న సంఘటనలు చూసి ఆర్ద్రతతో  వ్రాసినది)
.........................


కామెంట్‌లు