న్యాయాలు-906
"పరోపకారాయ సతాం విభూతి" న్యాయము
****
పరోపకారాయ అనగా పరుల లేదా ఇతరుల ఉపయోగార్థము.సతాం అనగా సత్పురుషుల, గౌరవనీయులైన మరియు జ్ఞాన వంతులైన.విభూతి అనగా ఐశ్వర్యము, విశేషమైన సంపద, గొప్పతనం, కీర్తి,అలౌకిక సంపద, గొప్ప సంపద,భస్మము,అణిమాద్యష్ట ఐశ్వర్యములు అనే అర్థాలు ఉన్నాయి.
మంచివారి ఐశ్వర్యము ఇతరులకు ఉపకారము చేయడమునకే వినియోగపడుతుంది.
"పరోపకారాయ సతాం విభూతి " న్యాయము లోని శ్లోకాన్ని మొత్తంగా చూద్దామా..!
"మూలం భుజంగైః శిఖరం విహంగైః శాఖః ప్లవంగైః కుసుమాని భృగః / ఆశ్చర్యమేతత్ ఖలుచన్దనస్య పరోపకారాయ సతాం విభూతియః మూలం!"
లేదా" భుంగైః శిఖరం విహంగైః శాఖాః క్పరమ్ గైః స్యాఖః స్యామ్ గైః ఖలుచన్దనస్య పరోపకారాయ సతాం విభూతియః!"
అనగా గంధపు చెట్టుపై పాములు దాని మూలాలలో పక్షులు,ఆ చెట్టు కొమ్మలపై కోతులు మరియు దాని పువ్వులపై తేనెటీగలు నివసిస్తూ ఉండటం వింత మరియు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ అందులో ఆశ్చర్యం లేదు కాదు.ఎందుకంటే దయ మరియు దాతృత్వ గుణం కలిగి వుండటం అనేది గౌరవనీయులైన జ్ఞాన వంతులైన గొప్ప వ్యక్తుల యొక్క విశేష లక్షణమది.
ఈ న్యాయములో గొప్పవారు, గౌరవనీయులు మరియు పండితులైన వ్యక్తులను గంధపు చెట్ఠుతోనూ , గంధపు చెట్టును పండితులు, దాతృత్వం గల వ్యక్తులతోనూ పోల్చడం విశేషం.
మరెందుకు అలా పోల్చారు అని నిశితంగా పరిశీలించి చూస్తే గంధపు చెట్టూ,మంచి వ్యక్తి - ఈ ఇరువురిలో ఎలాంటి వివక్షత లేదు గంధపు చెట్టు పక్షులు, పాములు, తేనెటీగలు, కోతులను ఎలాంటి వివక్షత లేకుండా చూస్తుంది. అలాగే మంచి వ్యక్తి గంధపు చెట్టులా వారూ వీరూ అనే భేద భావం లేకుండా తన దాతృత్వాన్ని చూపిస్తాడు.
మంచి వారిని గంధపు చెట్టుతోనే కాదు అతడు ఎలాంటి వాడో మరికొన్నింటితో కూడా పోల్చి చెప్పడం జరిగింది.ఆ శ్లోకాన్ని కూడా చూద్దాం.
"పిబంతి నద్య స్ప్యయ మేవనాంభః/ఖాదంతి వస్సాదు ఫలాని వృక్షః/పయోధరా స్పస్యమదంతి నైవ/ పరోపకారాయ సతాం విభూతయః "!
అనగా నదులు ప్రవహిస్తాయే కానీ తమ నీటిని తాము ఉపయోగించుకోవు.చెట్లు తీయటి పండ్లను ఇస్తాయే కానీ తాము తినవు.మేఘాలు వర్షించి నందుకు ప్రతి ఫలంగా కాయగూరలు నా కోరుకోవు.ఇవన్ని పరోపకారం చేస్తున్నాయే గానీ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించడం లేదు.అలాగే గొప్ప వాళ్ళు ఏమి ఆశించకుండా ఇతరులకు మేలు చేస్తారనే అర్థంతో మన పెద్దలు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు
ఈ విధంగా మంచి వారే కాదు వారి సంపద కూడా ఇతరుల శ్రేయస్సు కొరకు ఉపయోగపడుతుందనే అంతరార్థం ఇందులో యిమిడి ఉంది. అలాంటి వారిలా ఉండేందుకు మనం కూడా ప్రయత్నం చేద్దాం.చరిత్రకు శోభను చేకూరుద్దాం. మీరు కూడా నాతో ఏకీభవిస్తారు కదూ!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి