మౌనపు ఒడిలోని మాణిక్యం .:- చుంచు సంతోష్ కుమార్- సిద్దిపేట
సాహితీ కెరటాలు .
==============
" జ్ఞానవంతుడు ..
తన జీవిత ప్రయాణంలో విద్యార్థై ..
వేరొకరి జీవితానికి ఆచార్యుడౌతాడు ..!!

కనురెప్పల చీకటిలోన 
కలిగే కలల తత్వం బోధిస్తాడు
హృదయపు లోయన కలిగిన
ఊపిరి విలువని వివరిస్తాడు
కరముల స్వరముల ఎరుపు గాండ్రింపుల
ఫలితములను విన్నవిస్తాడు ..!!

వేదాలలోన సత్యసారముందని
మనిషి మనసున మమతాను రాగముందని
పుణ్యమే గొప్పదని సత్యము
మమత పంచితే వీడదు బంధమనీ
కనువిప్పు బోధన చేస్తాడు ..!!

కుల మతాలు మనిషి సృష్టి అంటాడు
మానవత్వాన్ని మించినది ఏది కాదంటాడు
అజ్ఞానానికి విజ్ఞానానికి వ్యత్యాసం వివరిస్తాడు
మాటిచ్చి మాటకు బానిస అయ్యే కన్నా
మౌనం గుండి రాజవ్వడం గొప్ప అంటాడు ..!!
_________ . 

కామెంట్‌లు