రెచ్చకొట్టకురా
రగిలించుటకు కోపము
దువ్వకురా
కయ్యమునకు కాలు
ఆజ్యంపొయ్యకురా
మండించుటకు మంటలు
సూదులుగుచ్ఛకురా
తెచ్చుకొనేవు చేటు
చెడపకురా
చిక్కుల్లోపడి చెడిపోయేవు
గోతులుతియ్యకురా
తీసినగుంటల్లో పడిపోయేవు
నటించకురా
దొంగబుద్ధి బయటపడేను
విషంక్రక్కకురా
పర్యావసానం అనుభవించేవు
నిజందాచకురా
సహించకు అన్యాయాలు
కొంపలుకూల్చకురా
తగులుతాయి నిరాశ్రయులశాపాలు
ఘనుడననుకోకురా
కూయకు కారుకూతలు
విపరీతబుద్ధిచూపకురా
కొనితెచ్చుకొనేవు వినాశనము
విప్పాలి మనస్సు
చెప్పాలి హితాలు
తెరిపించాలి కళ్ళు
చూపించాలి సత్యాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి