సాహితీ కవి కళా పీఠం
సాహితీ కెరటాలు
==============
సత్యం బృయాత్... ప్రియం బృయాత్,
సత్యమనే పలకవలెను,
ప్రేమగా మాట్లాడవలె.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది –
అన్నారుగా మన పెద్దతరం.
ఆచరిస్తే అవుతారు... అందరూ మన మిత్రగణం!
"జభాన్ కి మిఠాస్ సే,
శత్రూ భీ మిత్ర్ బనేగా!"
ఇవన్నీ అక్షర సత్యాలే కదా!
నాలుక తీయని మాటలతో
శత్రువు కూడా మిత్రుడు కాగలడు!
"శత్రూ కో ప్రేమ్ సే జీతో!" అన్నట్లు –
శత్రువుని కూడా ప్రేమతో జయించాలి.
మాటతీరే మనిషి వ్యక్తిత్వానికి,
నాగరికతకు ప్రతిబింబం.
వెటకారాలు, వ్యంగ్యాస్త్రాలు –
వీటితో మిగిలేది శత్రువులే!
కరుణ నిండిన కంటి చూపు,
మధురమైన మంచి మాట –
నీకు ఇస్తాయి చరిత్రలో మంచి పుట.
అభినందనలు, అభివాదం, కృతజ్ఞతలు, క్షమాపణలు –
ఇవే మాటల్లో ఉండాల్సిన నైపుణ్యాలు...!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి