బలరాముడు! అచ్యుతుని రాజ్యశ్రీ

 శ్రీకృష్ణ పరమాత్మ సోదరుడు బలరాముడు మహా పరాక్రమ వంతుడు దుర్యోధనని కూతురు లక్షణ ను కృష్ణుని కొడుకైన సాంబుడు పెళ్లాడి ద్వారకకు వస్తున్నాడు కౌరవులకి ఆ విషయం తెలిసింది సాంబుడిని లక్షణను దుర్యోధనుడు బందీగా ఉంచాడు అప్పుడు కృష్ణుడు దుర్యోధనుని పై యుద్ధానికి వెళ్తాను అని అంటే బలరాముడు నీవు వద్దు నేను దుర్యోధనుడిని ఒప్పించి తెస్తాను అని వెళ్ళాడు దుర్యోధనుడు బలరాముని బాగా ఆదరసత్కారాలతో గౌరవించాడు కానీ ఒక మాట అన్నాడు నేను నా కూతుర్ని ఒక ఆవుల మేపుకునే యాదవులకు ఇవ్వను నేను లక్షణను మీ ఇంటి కోడలుగా చేయను మీకు ఏయాతి శాపం ఉంది మాది రాజవంశం అని అహంకారంతో వెళ్ళిపోతాడు అప్పుడు బదరాముడు కోపంతో నీ హస్తినాపురాన్ని గంగలో కలిపేస్తాను అని తన నాగలితో దాన్ని పైకి లేపాడు అప్పుడు టెంపర్ తనంతో ఉన్న దుర్యోధనుడు కాళ్లబేరానికి వచ్చి బలరాముని స్తుతించి తన కూతురుని పంపుతాడు.బలరాముని గూర్చిన ఇంకో ఉదంతం ఉంది. సూతుడు ఒకసారి పురాణం చెప్తుండగా బలరాముడు అక్కడికి వస్తాడు అందరూ లేచి నిలబడతారు కానీ బ్రహ్మస్థానంలో ఉన్న సూతుడు లేవడు దానితో బలరాముడు కోపం వచ్చి దర్భ తోటి ఆయన కంఠం నరికేస్తాడు బలరామునిలో కోపం ఎక్కువ కానీ ఆ తరువాత పశ్చాత్తాప పడతాడు పురాణ ప్రవచనం చేస్తున్నా సూతుడు లేవనవసరం లేదు అప్పుడు అక్కడున్న వారంతా బలరామునితో నీవు మహా పాపం మూట కట్టుకున్నావు అనవసరంగా మహా గొప్పవాడైన సూతుని చంపావు ఆ మాట విని పశ్చాతాపంతో బలరాముడు తన యోగశక్తి ద్వారా సూతుని తిరిగి బతికించాడు.తను కృష్ణుని అన్న ఐనాకూడా తప్పు చేస్తే బాధ పడి తన తప్పు సరిదిద్దుకునే ఉత్తమ గుణం కలవాడు బలరాముడు.దుర్యోధనుడలా కాక గొప్పకి పోయేవాడు. తానుపట్టిన కుందేటికి మూడేకాళ్లు అనే దురహంకారి కావటంతో వంశనాశకునిగా చరిత్ర లో నిలిచాడు🌹
కామెంట్‌లు