స్వచ్ఛమైన పాలే ఔషధము...అమృతమ్ము!: - కోరాడ నరసింహారావు .
పాలు ఔషధమ్ము... పాలె అమృతమ్ము ...
 పాలు యన్న తల్లి పాలే...పాలు...పుట్టినది మొదలు చిన్న పిల్లలకు !

పిదప టీలు, కాఫీలు...
  పాయసాలు!
 అందరకు అన్నిటికి ..... 
  ఆవు పాలే బహు శ్రేష్ఠ తరము !

అధికముగా జనులంతా బర్రేపాలను,పిదప మేక , గొర్రె పాలను వినియో గించుటగమనార్హము!!

కొన్నియౌషధములకు గాడిద పాలను వినియోగించుటయు గలదు ....!

పాలనమ్ముకొనువారు  నీరుమాత్రమే కలు పగా

నేటి రోజులలో దేశ మంతయు ప్యాకెట్ పాలనే  అత్యధికముగా వాడుచు న్నారు !

ఈ ప్యాకెట్ పాలన్నీ నిలువ వుండుటకు....
  రసాయనములనెన్నో వాడుచున్నారు !   
     ఇవి స్లో పాయిజన్ లగుచు ఆరోగ్యమునకెంతో హాని చేయు చున్నవి...! 

ఇపుడు జనమంతా,పాలు
   అమృతము ,ఔషధము
అనుకుని విధి వశమున విషమును త్రాగుచున్నారు !

ఈ దుస్థితి పోవు మార్గమేది...!?
 
ప్రజలు పాలును ,విషముగాకాక...
  కల్తీ లేని స్వచ్ఛ మైన పాలుగా వినియోగించు కొను రోజులు వట్టి భ్రమయేనా...!!
      ******

కామెంట్‌లు