సుప్రభాత కవిత : - బృంద
పడి  లేచే కెరటం గురువు 
సడి లేని వేకువ గురువు 
తడి అంటని జ్ఞానం గురువు 
విడి పోని మాయ గురువు

కలిసి రాని కాలం లో 
కలతలే గురువులు 
వదిలి పోని బంధాలన్నీ 
వదలక చెప్పే పాఠాలు

ముళ్లలా గుచ్చుకునే మాటలు 
ముళ్ళు పడిన తీరని దుఃఖాలూ
మళ్ళీ మళ్ళీ గిచ్చే చేతలు
మళ్ళి పోనివ్వని మాయలు

ఎగసిన కోరికలకు 
తరిమిన ఆత్రాలకు 
కదిలిన కలలకు  
వదలని  తలరాతల బంధాలు

ఎన్ని అడ్డగించినా 
ఏవి నిరోధించినా 
ఎంత ఆక్షేపించినా 
ఆశ ఒక్కటే జీవన సూత్రం

రేపటి వెలుగుకోసం 
చీకటి తెర లోపల 
వేకువకై ఎదురుచూసే 
వేడుకే జీవితమంటే!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు