నక్క కుక్క :- ఎడ్ల లక్ష్మి
నక్క కుక్క కలశాయి 
ఒక్క బొక్కను చూశాయి 
నాది నాది అనుకుంటూ 
పరుగులు తీసి ఉరికాయి 

నక్క ఊత పెడుతూ ఊరికింది 
కుక్క బౌ బౌ మంటూ పోయింది 
పక్క చేల్లో ఉన్న రైతన్న 
నక్క అరుపులు విన్నాడు 

దుడ్డు కర్ర చేత పట్టుకొని 
గబగబా అతడు వచ్చాడు 
నక్కను తరిమి కొట్టాడు 
కుక్కను దగ్గరికి పిలిచాడు 

కుక్క ముందుకు వెళ్ళింది 
బొక్కను నోట పట్టింది 
కటకట అది నా మిలింది 
బొజ్జ నిండా మెక్కింది 


కామెంట్‌లు