న్యాయాలు-901
"పతనాంతా స్సముచ్ఛ్రయాః" న్యాయము
*****
పతన అనగా పడిపోవడం లేదా క్షీణించడం.అంత అనగా ముగింపు లేదా తరువాత.సమ అనగా సమానమైన,ఉచ్ఛ్రయః అనగా పెరుగుతున్న,పెరుగుదల, ఎత్తు,పెంచు.సముచ్ఛ్రయః అనగా మిక్కిలి పొడుగు అని అర్థము.
ఎగిరేదంతా క్రిందికి పడడం కోసమే అని అర్థము.దీనిని సామాన్య అర్థంతో లేదా సైన్స్ పరంగా చూస్తే అవును నిజమే కదా! అని ఎవరికైనా అనిపిస్తుంది.
అయితే ఈ న్యాయం ముఖ్యంగా మిడిసిపాటు,తలబిరుసు అహంకారంతో ప్రవర్తించే వ్యక్తులను గురించేనని మన పెద్దవాళ్ళు తరచూ ఉదాహరణగా చెబుతుంటారు.
దీనిని తెలుగులో పెరుగుట విరుగుట కొరకే" అనే సామెతతో పోల్చవచ్చు. పై లక్షణాలు కలిగిన వ్యక్తులకు తప్పకుండా ఈ విధంగా తగిన శాస్తి జరుగుతుందని చెబుతుంటారు.అంతే కాదు దీనినే మన పెద్దలు దుష్ట బుద్ధి గల వాళ్ళను ఉద్దేశించి"పాపం పండేరోజు వస్తుంది"అని హెచ్చరిస్తూ,అలా చేయకూడదని హిత బోధ కూడా చేస్తుంటారు".
మరిక దీనికి దగ్గరగా, ఇలాంటి అర్థం వచ్చేలా సుమతి శతక కర్త రాసిన పద్యాన్ని చూద్దామా!.
సరసము విరసము కొఱకే/పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే/పెరుగుట విరుగుట కొఱకే/ధర తగ్గుట హెచ్చు కొరకె తథ్యము సుమతీ!"
అనగా ఎక్కువగా హాస్యమాడితే విరోధం కలుగుతుంది.లెక్కలేని సౌఖ్యాలను అనుభవించేవారు ఆ తర్వాత పెద్ద పెద్ద కష్టాలను పొందుతారు.బాగా ఎక్కువగా ఏపుగా పెరిగేది విరిగి పోతుంది.ధరలు బాగా తగ్గుతున్నాయంటే పెరిగేందుకే అని అర్థము.
ఏదైనా అతిగానూ అక్రమ మార్గంలోనూ వెళితే ఫలితాలు అలాగే ఉంటాయి. అప్పుడు "చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు" అవుతుంది.
" అలాగే అతి గారాబం కూడా .అతి గారాబం అనర్థ దాయకం" అని పిల్లల విషయంలో హెచ్చరిస్తూ "గారాబం గంజికేడిస్తే వీపు దెబ్బలకు ఏడ్చిందట "అంటుంటారు.
ఇక అసలు విషయానికి వద్దాం. ఎగిరేదంతా కింద పడటం కోసమే అన్నట్టు పాపాలు చేసే వారు ఎప్పుడో ఒకప్పుడు ఆ పాప ఫలితం అనుభవించక తప్పదని చెబుతూ పాపం పండుతుంది. కాలమే సమాధానం చెబుతుంది అనడం మనం తరచూ వింటూ ఉంటాం.
పైకి ఎగరేసింది కింద పడినట్లు పైపైకి మితిమీరి పాపాలు చేస్తే.ఆ పాప కర్మ ఫలితాన్ని తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది అని, దానినే పాపం పండటమని అంటుంటారు.
పతనాంతా స్సముచ్ఛ్రయాః"న్యాయమును ఈ విధంగా అనేక కోణాల్లో చూడవచ్చు.మొత్తానికి చెప్పొచ్చే విషయం ఏమిటంటే అడ్డదారుల్లో ఎదిగే వ్యక్తులకు, అహంకారంతో తిరిగే మనుషులకు ఏనాటికైనా తప్పకుండా తగిన శాస్తి జరుగుతుందనేది ఈ న్యాయము లోని అంతరార్థము అది గ్రహించి మసలుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి