ఇది నాకు
కేవలం వృత్తి మాత్రమే కాదు
ఇది నాకొక వరప్రసాదం.........
టైలరుగా ఉన్నందుకు
గర్వపడుతున్నాను
నేనెంతో నేర్చుకున్నాను
ఢీలా పడినప్పుడు
నేనున్నాను నీకు
అని
నాతో చెప్తున్నట్లనిపిస్తుంది
కుట్టు యంత్రాన్ని
చూస్తున్నప్పుడు
పలు సమయాలలో
నా ఏకాంతంలో
మంచి మిత్రుడు
ఈ కుట్టుయంత్రం
పలు సందర్భాల్లో
నాకు ఓ ఓదార్పు
నాకు ఓ భరోసా
ఈ కుట్టు యంత్రం
కుట్టు యంత్రం
కప్పు టీ
మంచి పాట
అనేక సందర్భాల్లో
నా పరిసరాలను
అందంగా మర్చేసాయి
అందుకే
వీటన్నింటికీ నా కృతజ్ఞతలు
- ఇట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి