ఒక ఉదయం!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
విద్యా అనే విద్యుత్తును వెలిగిస్తే వెలుగుతాం 
ముట్టుకుంటే మురిసిపోతాం మసి కాదు!!
చెట్లను వెలిగిస్తే చీకట్లు కమ్ముకుంటాయి 
కాంతి పొట్లంలో కమ్మని మిఠాయి చిత్రం దాగుంది. 

ఎగిరే కోరికలు చివరి రోజుల్లో 
రాజులా మారుతాయి. 
చింత చిరుతల పరిగెత్తితే సంతోషం తాబేలు పరుగు గెలిచింది. 

కలుపుతూ పోయే దారం కులుకుతూపోయే పువ్వులు కలిసే దేవుని మేడను చేరుతాయి.
కొప్పులోని మల్లె నిప్పులో కరిగిన బంగారం పరిమళిస్తూనే ఉంటాయి. 

నీ నవ్వు రాలిన పువ్వు చేరాల్సిన చోటు మగువ ముసిముసి మనసే కదా!!
చెదిరిన చెలి చెంత బెదిరిన ఉడుతా భక్తితో ప్రణమిల్లి ప్రాణం దానం చేసే 

తెల్లని మనసు ఉషస్సులా ఉదయిస్తే ధవళ వర్ణం ప్రేమ అయితే సంధ్య దినదిన గండం అనే అగ్నిగుండంలో దూకింది. 
సాగుతున్న సన్నని బంగారు తీగలా తరగనీ మెరుపు వీడని ఓడుపు నిన్ను చూడని చూపు ఎప్పటికీ నిన్ను వీడవు. 

ఒత్తిడితో ఉన్న తిరుగుతున్న భూమిలా నీకోసం ఒక ఉదయం ఒక అస్తమయం నేను.!!

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు