ఉవ్విల్లూరిన పిట్ట : - ఎడ్ల లక్ష్మి
గుండు మీద చెట్టు 
గుత్తులు గుత్తులు కాసింది 
దోరా దోరా కాయలు 
చెట్టు నిండా ఉన్నాయి 

గుట్ట మీదున్న పిట్ట
అటు ఇటు తిరుగుతూ
మిట్ట మిట్ట చూస్తూ 
ఉవ్విల్లూరుతు ఉంది

గట్టి గాలి వీచింది
చెట్టు మీది పండ్లన్నీ 
కుప్పలు కుప్పలు రాలాయి 
పిట్ట చూసి మురిసింది 

రెక్కలు విప్పి లేచింది 
చెట్టు కింద వాలింది 
పొట్ట నిండా మెక్కింది 
రివ్వున లేసిపోయింది 


కామెంట్‌లు