ఆదర్శ గురువు :- నామ వెంకటేశ్వర్లు, SA తెలుగు, జి. ప. ఉ. పా. అయిటిపాముల,
 బంగార మసొంటి భరతభూమిలోన
వెలసెను 28 రాష్ట్రములు అందు 
కలదు అన్నపూర్ణయైన ఆంధ్రప్రదేశ్ నొకటి 
ఆంధ్రమునకు రాజధాని హైదరాబాదు 
అందు నిర్మించే ఉస్మాను నాడు 
కళల కళాశాల నొకటి 
అందుండె పెక్కు భాగములలో 
తెలుగు శాఖ నొకటి 
తండ్రికి తగ్గ తనయుని వలె 
తెలుగు శాఖకు అధ్యక్షుడుగ నుండి రఘుమన్న తేజముగ 
 ఆ భాగమున కే వెలుగు నింపిను
మనసు చూడు మల్లెపువ్వు తెలుపు....పలుకు చూడ వినసొంపునుండు         
తేనెలొలుకు తేటైన మాటలతో 
మాలో ఎంతో ఉత్తేజము నింపెను ......
కపటము లేని మాటలతోనే మాపై కాంతి ప్రసరింపజేసే...      
 కప్పలాగా అరిచే కప్పదాటు కపట నటులను  
సైతం కవిత్వం తో కామూషీగా నోరు మూయించెను.....
మెత్తనైన మాటలతో చనుకులేసి చురుకుగా మమ్ముల చక్కదిద్ది 
మంచి చదువరులుగా మమ్ము మార్చి వేసే...
చక్కని స్వరము తో పల్లె పదాలు పాడి మమ్ము ఆచరింప చేసె 
కంచు కంఠము తో పద్యంబులు పటించి మమ్ము కదలకుండ చేసె  మెండు 
సమయపాలన చక్కగా పాటించి 
తెలియజేసే మాకు భావి విద్యుక్త ధర్మంబు 
పుట్టు తెలుగు వారమైన మనము 
ఎల్లవేళల తెలుగే మాట్లాడమనెను
నిండు కుండ వలె తా తొనకకుండి 
సర్వ వేదములను చక్కగా చదివి  అందుగల సత్యములను 
వెలువరించిన వారు. తాను నేర్చుకున్న జ్ఞానమెంతో 
మేము గైకొంటిమి కొలది జ్ఞానంబును 
 బ్రాహ్మణమంటే కులము కాదని 
 బ్రాహ్మణమంటే జ్ఞానబాండము గలవారని 
బహు చక్కగా మాకు బోధ చేసె 
వేదములందు వర్ణ భేదము తప్ప 
కులభేదమే లేదనెను.... తాను స్వతహాగా పేరులోని కులమును
 తొలగింప చేసుకొని రఘుమా రెడ్డి యే రఘుమన్నగా మారే 
సాహిత్య సమరమున సవాలు విసిరితే సాటి వచ్చిన వారు కల్ల 
సాహిత్య సమరము నందు 
సమరభేరి మోగించి... కవి శాసనుడనే బిరుదు పొందిన వారు 
మరి శోధన ప్రకల్పము నందు 
రామాయణ భారత భాగవతాల లాంటి నెన్నో గ్రథముల ఫై 
వివేచన చేసి,  అందుగల సత్యా సత్యములను చక్కగా
 విషధపరిచి పెక్కు గ్రంథములను ముద్రింప చేసిన వారు 
ఎట్టి ప్రశ్నలకైనా 
తనకున్న బహుళ జ్ఞానముతో  చక్కగా జవాబులిడుచుండే 
సర్వ ఆశ్రమాలను చక్కగా పాటించి చూపే..
తలకు పాగ నడుముకు పంచ కట్టి  
తెలుగుతనమునుట్టి పడ చేసిరి 
అతనే అతను ఎవరో కాదు అతనే మన అన్న రఘుమన్న.
=====================

కామెంట్‌లు