‘ఎవరు?’:- -వి.వి.వి.కామేశ్వరి (v³k) వెలగలేరు
 “అర్థరాత్రి 12 గంటల సమయం. నిర్మానుష్యమైన రోడ్డు ఎదురు చూస్తోంది, వీధి దీపాల వెలుగులో” హారర్ కమ్ క్రైమ్ కథకు నాందీ వాక్యాలు పలుకుతున్నాడు నానీ.
“హే! ఆపరా! అరిగిపోయిన రికార్డులా నీ బోరింగ్ నువ్వూను” చిరాకుపడ్డాడు పిరికిపందగా పేరు మోసిన బాబీ.
“పోనీ నువ్వు చెప్పరా!”ఛాలెంజ్ విసిరాడు నానీ.
“ కాకులు దూరని వంటగది. చీమలు పుట్టలు పెట్టే చిన్నగది. ఆ వంటగదిలో నుంచీ వినిపించింది, భయంకరమైన అరుపులతో కలగలిసిన పెద్ద చప్పుడు” కళ్ళు పెద్దవి చేసి చెబుతున్నాడు బాబీ.
“ ఏ గ్యాస్ లీకయ్యి గ్యాస్ బండ పేలిందా?” వెటకారంగా అడిగాడు నానీ.
“కాదు, దొంగచాటుగా పాలు తాగుతున్న పిన్ని మీదకు దూకింది”
“ఎవరు”
“ దొంగ పిల్లి”
*సమాప్తం*

కామెంట్‌లు