రామవరం అనే ఒక చిన్న ఊరిలో నవ్య,కావేరి అనే ఇద్దరు స్నేహితురాల్లు ఉండేవారు. చదువులో వారిద్దరూ చాలా తెలివైనవారు.ఆ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు.
ఇద్దరికీ చదువు అంటే చాలా ఇష్టం.నవ్యకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ ఆత్మవిశ్వాసం తక్కువ.కావేరికేమో లాయర్ కావాలని బలమైన కోరిక ఉండేది. చాలా ధైర్యవంతురాలు. ఎంతోమంది అమాయకులు చదువు రాక అన్యాయానికి గురవుతున్నారని బాధపడుతుంది.వారికి సహాయం చేయాలని నిశ్చయించుకుంటుంది.కావేరికి తన లక్ష్యాన్ని ఏనాటికైనా చేరుకుంటాననే నమ్మకం ఉండేది.నవ్య ఎప్పుడు అనుమానంతో తన లక్ష్యాన్ని చేరుతానో లేదో అని బాధ పడుతూ ఉండేది.ఎవరైనా ఏదైనా ప్రతికూలంగా చెప్తే దానినే నమ్మేది.ఒకరోజు నవ్య,కావేరి వాళ్ళ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో అనుకుంటూ పాఠశాలకు వెళుతుంటే ఆ ఊరిలో పని పాటా లేని కొందరు "మీరు అమ్మాయిలు మీకు చదువెందుకు?"చక్కగా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చు" అని అంటారు. గ్రామీణ ప్రాంతాల వారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయలేరు.మీ నుంచి కాదు అని నిరుత్సాహపరుస్తారు.దానితో నవ్య ఆలోచించడం మొదలు పెట్టింది.నేను నా లక్ష్యాన్ని చేరుతానో లేదో అని అనుమాన పడుతుంది.నా చదువు ఆపేసి పెళ్లి చేసుకోవడం మంచిదేమో అనుకొని తన నిర్ణయం మార్చుకుంటుంది.అదే సందర్భంలో ఇంట్లో మంచి సంబంధం రావడం వలన నవ్య పెళ్లి కుదురుతుంది.దానితో ఆమె కోరిక తీరకుండా పోతుంది.తన భర్తది చాలీచాలని సంపాదన.సంసారం,ఇద్దరు పిల్లలతో చాలా బాధపడుతుండేది. పెళ్లి చేసుకోకుండా చదువుకుంటే బాగుండేది అని ఆలోచిస్తుంది. కానీ పరిస్థితులు సహకరించవు. నవ్య స్నేహితురాలు కావేరి ఆ ఊరి ప్రజల మాటలను పట్టించుకోలేదు.తన లక్ష్యాన్ని చేరుతానని ఆత్మవిశ్వాసంతో చెప్పి కష్టపడి చదివి లాయర్ అవుతుంది.తన తెలివితో ధైర్యంగా కేసులను వాదించి మంచి పేరుతో పాటు,డబ్బు కూడా బాగా సంపాదించింది. ఎంతో మంది పేదలకు సహాయం చేస్తుంది.చాలా రోజుల తర్వాత నవ్యను కలిసిన కావేరి తన పరిస్థితిని చూసి చాలా బాధపడుతుంది.నేను నీలాగా కొంచెం ధైర్యం చేసి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు.నేను కూడా వైద్యురాలుగా పేద ప్రజలకు సేవ చేస్తూ సంతోషంగా ఉండేదాన్ని.నా పిల్లలను చక్కగా చూసుకునే దాన్ని. నాకు ఈ కష్టాలు ఉండేవి కావు అని చెప్తుంది.ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించు.నేను నీకు సహాయం చేస్తానని కావేరి అంటుంది.కావేరి చెప్పిన ధైర్యంతో ఆగిపోయిన చదువును కొనసాగిస్తుంది. తర్వాత కావేరి సహాయంతో మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తుంది.ఇద్దరు కలిసి పేద ప్రజలకు అనేక రకాల సేవలు చేస్తారు.అనాధ పిల్లలకు చదువులు చెప్పిస్తారు.వృద్ధులకు వైద్య సేవలు చేస్తారు. మంచి స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు. సేవా రంగంలో అనేక బహుమతులు అందుకుంటారు.జీవితంలో ఎవ్వరు ఎన్ని రకాలుగా నిరుత్సాహపరిచిన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి.అప్పుడే మనకు విజయం దక్కుతుంది.
ఆత్మవిశ్వాసం:- వై.అక్షయ-10వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల ఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి