"" లేత గులాభీలం "":-డా. ఆళ్ళ నాగేశ్వరరావు- :7416638823
సాహితీ కవి కళాపీఠం
సాహితీ కెరటాలు
==============
కన్నవారి కనుపాపలం...
బంధువులకు బాంధవ్యులం...
గురువులకు శిష్యులం...
భరతమాతకు ప్రియపుత్రులం!

విరిసి విరియని మొగ్గలం...
అభం శుభమెరుగని సహృదయులం...
కల్మషమెరుగని స్వచ్ఛ మనస్కులం...
 చాచాజీ  హృదయ నేస్తాలం!
బుడి బుడి నడకల బుడుగులం...
చదువులు చక్కగా చదివెదం...
ఆటలు బాగా అడెదం...
అలుపెరగక శ్రమించెదం
అందరి మెప్పులు పొందేదం!

పెద్దల మాటలు వినేదము..
మారాం చేయడం మానెదము...
సత్యమునే నిత్యము పలికెదము...
మాతృభాషలోనే మాట్లాడెదము!

అరవిరిసిన లేత గులాభీలం...
ర్యాంకుల ముళ్లళ్ళో చిక్కిన చిన్నారులం...
అమూల్య బాల్యస్మృతులను కోల్పోతున్న వారం...

కోల్పోతున్న వాటిని అందించమని వేడుకుంటున్నాం!

*********


కామెంట్‌లు