నా ప్రయాణ అనుభవాలు:- యం.రమేష్-8 వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -గ్రా.రేగులపల్లి -మండలం బెజ్జంకి
  మేము అందరం రాత్రి పాఠశాలకు వచ్చాము. అంత లోపు టీచర్లు బస్సు తీసుకొని వచ్చారు. సామగ్రి సదిరి బస్సు ఎక్కించారు. అందరం పడుకున్నాము. మా బస్సు బయలు దేరింది. ఉదయం లేచేసరికి భద్రాచలం చేరుకున్నాము.భద్రాచలంలో ఆలయ  మెట్లు ఎక్కి సీతారాముల దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత బస్సు ఎక్కి పాపికొండలకు వెళ్లి పడవ ఎక్కినాము పడవ ఎక్కిన తర్వాత పాటలు పెట్టారు.ఆటలు ఆడించారు. సరదాగా అల్లరి చేసుకుంటూ వెళ్ళాం. మధ్యలో ప్రాచీన శివాలయం ఉంది.కాలువలో కాళ్లు కడుక్కొని శివాలయంలో శివుడిని దర్శనం చేసుకుని పడవ ఎక్కాం. పడవలో ఆహారం పెట్టారు. తర్వాత పడవ ప్రయాణం మొదలైంది పాపికొండలు వచ్చాయి. అందరికీ కొండలు చూపించారు. తిరిగి ప్రయాణం చేశాం. ఈ ప్రయాణం ఒకరోజు పట్టింది. బస్సు ఎక్కి మేడారం వచ్చాము. మేడారంలో సమ్మక్క సారలమ్మ ల దర్శనం చేసుకొనేసరికి రాత్రి అయింది. మళ్ళీ బస్సులో రేగులపల్లికి  బయలుదేరాము అర్ధరాత్రి పాఠశాలకు చేరుకున్నాం. మా  సామగ్రినంత సర్దుకున్నాము.టీచర్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశారు.వారు వచ్చి మమ్మల్ని ఇండ్లకు తీసుకొని వెళ్లారు.

కామెంట్‌లు