నా పంచవదుల సంఖ్య---
925.
వైద్యులకు జీవితము ,
మానవ సేవకి అంకితము!
జాతీయ వైద్యుల దినమా?
ప్రతి దినం సమర్పితము !
బిధాన్ చంద్ర రాయ్ జీవితం, వైద్యులకు ప్రత్యేకము!
వారందించిన సేవ ,
వైద్యరంగాన ఆదర్శప్రాయము !
ఆ వర్ధంతి/జయంతి ఒక్కటై, వైద్యుల దినోత్సవము,
పివిఎల్!
926.
బి.సి.రాయ్ ఇంగ్లాండులో,
ఉన్నత విద్యాభ్యాసం చేసారు!
కలకత్తా మెడికల్ కాలేజీ అధ్యాపకులయ్యారు !
అనేక ప్రముఖ వైద్య సంస్థలు, తాను నెలకొల్పారు !
మహిళలు, పిల్లలకు వైద్యశాల, ఏర్పాటు చేశారు !
భారతరత్న ,గౌరవ డాక్టరేట్, సత్కారం పొందారు ,పివిఎల్!
927.
వైద్యులారా,
నారాయణ. రూపాల్లారా,
అభివందనము!
ప్రాణదాతగా ప్రతి వ్యక్తి ,
మీకు నిజ సంబంధము !
కరోనా కాలాన మీ పనితీరు,
అనితర సాధ్యము!
అపర ధన్మంతరులై,
ఆదుకున్న, సహజ గుణము!
ప్రాణికోటిలో మాననీయులు,
మీరు ఆ దైవ సమము,
పివిఎల్!
928.
మీరూ మొదట మనుషులే ,
ఈ నిజాన్ని మరవకండి!
దయచేసి వైద్యాన్ని,
వ్యాపారంగా ,ఎన్నడూ,
మార్చకండి!
ఫీజు రాయితీ వద్దు, ,వైద్యంలో, నిజాయితీ కావాలండి!
రోగుల్ని కాదు పోరాడి, రోగాలని సదా హతమార్చండి!
ఈ దినాన మా శుభాకాంక్ష, మీరు డా.కోట్నీస్ లవ్వాలి,
పివిఎల్!
'_________
డాక్టరంటే డాక్టర్ కోట్నీస్!:- డా. పి.వి.ఎల్. సుబ్బారావు, 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి