1.
కైకేయి పంతమే,
శ్రీరామ వనగమనం!
హనుమ పంతంతో, ,
సీతాన్వేషణ సఫలం!
శ్రీరామ బాణం పట్టు,
రావణ మరణం చూపెట్టు!
శకుని పాచికలపై పట్టు,
కురువంశనాశన తొలిమెట్టు!
శ్రీకృష్ణుని ధర్మపట్టు ధర్మసంస్థాపనకు కోట కట్టు!
2.
భారతీయుల పంతం,
బానిసత్వ విమోచనం!
శాస్త్రజ్ఞుల పంతం,
సత్యశోధన జీవితాంతం!
కర్షకుల పంతం,
అన్నదాతలై అండ నిలవడం!
శ్రామికుల పంతం, పారిశ్రామికభివృద్ధి సొంతం!
సైనికుల సడలని,పంతం ఆపరేషన్ సింధూర్ విజయం!
3.
నాయక సుపరిపాలన పంతం, ప్రజాస్వామ్యం ఫలవంతం!
వైద్యుల సరిపంతం కరోనా, కనుమరుగైన ఉదంతం!
ఇంజనీర్ల నైపుణ్య పంతం, నిర్మాణాలు నాణ్యవంతం!
లాయర్ల న్యాయపక్ష పంతం, సమన్యాయ సరి తంత్రం!
సాహితీవేత్తల రసపంతం, సామాజిక హిత సూత్రం!
4.
కుటుంబాన ఐక్యతాపంతం ,
గృహమే శాంతి నివాసం!
భార్యాభర్తల అనురాగ పంతం, దాంపత్యం ఆదర్శనీయం!
విద్యార్థుల విద్యార్జనా పంతం ఉన్నత శిఖర సాధన తథ్యం!
ఎన్నికల్లో ఓటర్ల పంతం,పట్టు
సరినేతలే విజయం చేపట్టు!
మనిషిఆశయ సడలనిపంతం,
లక్ష్యంచేరడం శీఘ్రవంతం!
5.
అగ్ర రాజ్యాల పంతాలు, విశ్వాన మారణ హోమాలు!
మతాల పట్టింపులు, మానవాళికి ప్రాణాంతకాలు!
అక్కర్లేని పంతాలుపట్టింపులు, అశాంతికి మూలాలు!
మనుషుల మధ్య సౌహాద్రం, పంతాలు, పన్నాగాలు దూరం!
మనిషి హుందాతనమే సర్వ, సమస్య పరిష్కార సాధనం!
________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి