జెండా జయంతి! స్వాతంత్య్ర ఆహ్వానగీతి!:- డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం,-9441058797.
 నా పంచపదుల సంఖ్య---
     1781-1784.
1781.
"భారతదేశానికి ఒక జాతీయ పతాకం "గ్రంథము! 
గ్రంధకర్త పింగళి వెంకయ్య, సృష్టి మనపతాకము! 
బెజవాడ కాంగ్రెస్, సమావేశము గాంధీనిర్దేశము!
మొదట కాషాయం హరితం, రంగులు మధ్యలో రాట్నము!
పిదప చేరింది సత్య ,
అహింసల చిహ్నం ధవళము,
పివిఎల్!
1782.
త్రి వర్ణాల మధ్య గ్రామజీవన, సంకేతము రాట్నము!
త్రి వర్ణాలు మధ్య రాట్నంగా ,
నాటి జాతీయ పతాకము! 
పంతొమ్మిది వందల జూలై,
ఇరవై రెండు తీర్మానము! 
నెహ్రు రాట్నం బదులు,,
అశోకధర్మచక్రం చేర్చడము!
అశోకధర్మచక్రము మన, సంస్కృతి ప్రతిబింబము పివిఎల్!
1783.
పింగళి వెంకయ్య రూపశిల్పి, జాతీయ జెండా మూలము! 
మువ్వన్నెలు శౌర్యం, శాంతి, సస్యశ్యామలాల సంకేతము! 
ధర్మచక్రం ఇరవై నాలుగు ,
ఆకులు సుపాలనము!


జెండా వందనము జాతికి, గౌరవం ,స్ఫూర్తిదాయకము!
ప్రపంచ దేశాల పతాకాలలో, మనది విశిష్టము, పివిఎల్! 
1784.
ఆనాటి దేశభక్తుల, త్యాగనిరతి స్మృతి చిహ్నము! 
 జెండా జీవించాలి గగనం, భువనం ఉన్నంత కాలము!
చంద్ర మండలాన జెండా, ఎగరడం గర్వకారణము!
జెండా గౌరవం కాపాడడం, భారతీయుల కర్తవ్యము!
ఆకాశాన ఎగిరితే జెండా, ఆనందం గుండెల నిండా, 
పివిఎల్!
_________

కామెంట్‌లు