పొలంలోని పుట్ట లోపల చీమల కుటుంబం నివసిస్తుండేది. అవి ఒక రోజు భోజనం చేస్తుండగా అనుకోని అతిధి ఎలుక వచ్చింది. అతిథి ధర్మాన్ని పాటిస్తూ " అన్నయ్య రండి! భోజనం చేద్దువు ..అని " ఎంతో ఆప్యాయంగా చీమలు పిలిచాయి. ధాన్యం తింటుండగా రైతు తరిమితే పారిపోయి వచ్చిన ఎలుక, ఆ విషయం చెప్పకుండా, 'పర్వాలేదులే! మీరు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాను. చాలా రోజులైంది కదా చూడక ' అని ఎంతో ఆప్యాయత ప్రదర్శిస్తూ పలికింది.
'మొఖమాట పడకు, వచ్చి కూర్చుని తిందువు రా' అని చీమల కుటుంబం ఆహ్వానించింది. బిడియపడుతూ వద్దు.. వద్దులే..అనుకుంటనే వచ్చి ఎలుక భోజనానికి కూర్చుంది. చీమలు పచ్చటి ఇస్తారాకులో గింజలు, బెల్లం, రొట్టెలు పప్పు ను వడ్డించాయి. ఆహారాన్ని చూసిన ఎలుకకు మతిపోయింది. తాను ఏనాడు కూడా ఇంత మంచి ఆహారం తినలేదని చీమల వైభవాన్ని చూసి ఎలుకకు ఈర్ష్య పెరిగింది. రాశులుగా పోసి ఉన్న చీమల ఇంటిని సొంతం చేసుకోవాలనే దురాశ పుట్టింది. తిన్న తర్వాత చేతులు కడుగుతూ "మీ ఆతిథ్యం నచ్చింది. అయినా మీకు ఇంత పెద్ద నివాసం అక్కర్లేదు కదా! నాలాంటి పెద్ద మనిషికి ఇస్తే బాగుంటుంది మీరంతా ఇక్కడనుండి ఖాళీ చేసి వెళితే బావుంటుందని" ఎలుక నర్మగర్భంగా పలికింది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే ఎలుక మాటలకు చీమలు నివ్వెర పోయాయి. వెంటనే దాడి చేయాలని యువ చీమలు ఆవేశపడగా వృద్ధ చీమ ఓదార్చుతూ... మీరు కోరిన కోరికను తీర్చడానికి మేము సిద్ధమే! కానీ ఇక్కడికి సమీపంలోనే పెద్ద నివాసం మా పుట్ట ఉంది. అది అంగ రంగ వైభవంగా ఉంటుంది. అక్కడ ధాన్యపు రాశులు ఎన్నో ఉన్నాయి. అది నీకు బాగా ఉంటుందని ఎలుకతో వినయంగా చెప్పింది.
అయితే అది ఎక్కడుందో చూపించండి! అని ఎలుక అడిగింది. చీమల కుటుంబం బయటకు వచ్చి దూరంగా ఉన్న మరో పుట్టను చూపాయి. అక్కడికి వెళ్లి ఎలా ఉందో చూసి చెప్పగలవు అని చీమలు చెప్పాయి. ఆత్రుతతో పరుగు పరుగున పుట్టలోకి దూరింది ఎలుక. తేరిపారా చూస్తుండగానే దాని గుండె గుభేలుమంది . ఎదురుగా ఉన్న ఒక తాచు పాము పడగ విప్పి ఎలుకపై దూకింది. అదృష్టవశాత్తు పాముకు తోక మాత్రమే చిక్కి తెగిపోయింది. ఎలుక ప్రాణాలతో బయటపడింది. ఆగకుండా తన నివాసానికి వెళ్ళిపోయింది. బతికి ఉంటే ఇంకేదైనా తినొచ్చు కానీ, చీమల జోలికి వెళ్లొద్దని నిర్ణయించుకుంది. అప్పటినుండి తనకంటే చిన్న ప్రాణుల పట్ల చులకన భావాన్ని ప్రదర్శించలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి