"ప్రపంచ జనాభాకు పరిమితులు":- ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)సారవకోట -: 9490904976
సమిష్టి కుటుంబం సమసిపోయే..
ఉమ్మడి కుటుంబం ఊసేపోయే..

పెద్ద కుటుంబం పేరే పోయే
పెను భారమని, పెక్కు సవాళ్లని,
పెనుగులాటలని ప్రక్కకిపోయే..

చిన్న కుటుంబం
చింత లేని కుటుంబమని
చీకూ చింతా ఉండదని
చిగురించాయి..

పరిమిత కుటుంబం
మిన్నైనదని, మేలైనదని
ముందుకొచ్చి,వేరై వెళ్ళాయి..

బండెడు పిల్లల నుండి
గంపెడు పిల్లలకి
ఒంటి పిల్లడికి వచ్చేసాయి.

అధిక జనాభాను అరికట్టేందుకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
పథకాలు ఇచ్చేందుకు,
ఎన్నికల్లో పోటీ చేసేందుకు
పరిమిత పిల్లల నిబంధన పెట్టేసాయ్..

ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ
(వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ)లతో
ఒన్ టు టూ అని పిల్లల్ని కట్టడి చేశాయి.
భారత్  కూడామున్ముందు ఒన్ ఆర్ నన్ 
స్థితికి వచ్చే పరిస్థితి.

అధిక జనాభాతో ఆల్రెడీ 
చైనా చిల్డ్రన్స్ అసలొద్దని చెప్పేసింది.

పదుగురు పిల్లలు పోయే..
ఐదునలుగురు ఆయే..
ముగ్గురు మాయే.. (వద్దు)
ఇద్దరు ఈయే (హద్దు)
ఒక్కరు ఓయే (ముద్దు).


కామెంట్‌లు